దర్శకుడి మరణంతో ఇండస్ట్రీ షాక్.. కుళ్లిన స్థితిలో శవం!

Director C Sivakumar found dead at his house in Chennai
Highlights

మంగళవారం చెన్నైలోకి, సాలిగ్రామంలోని తన ఇంట్లో శవంగా కనిపించారు శివకుమార్. ఆయన మరణవార్తతో సినిమా ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. 

ఒకప్పటి డైరెక్టర్ సి.శివకుమార్ మరణం ఒక్కసారిగా ఇండస్ట్రీని షాక్ కు గురి చేసింది. కోలీవుడ్ లో అర్జున్, అజిత్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన శివకుమార్ తన ఇంట్లో శవమై కనిపించాడు. మంగళవారం చెన్నైలోకి, సాలిగ్రామంలోని తన ఇంట్లో శవంగా కనిపించారు శివకుమార్.

ఆయన మరణవార్తతో సినిమా ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించడం మరింత బాధను కలిగించింది. అసలు ఆయన ఎలా మృతి చెందారనే విషయం పోలీసులకు సైతం చిక్కడం లేదు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ చేపట్టారు. డైరెక్టర్ గా మారకముందు భాగ్యరాజ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు శివకుమార్.

ఇక దర్శకుడిగా ఆయన రూపొందించిన రెండు సినిమాలను పళనిస్వామి నిర్మించారు. ఆయన మరణించారని తెలుసుకున్న సెలబ్రిటీలు ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.   

loader