గుండెపోటుతో ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు భార్య అనిత హఠాన్మరణం... వివరాలు

ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు సతీమణి అనిత గుండెపోటుతో మృతి చెందారు. తీవ్ర గుండె నొప్పితో బాధ పడుతున్న అనితను హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

ఇక నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఫిదా సినిమా షూటింగ్ లో భాగంగా... అమెరికాలో పర్యటిస్తున్నారు.

అనిత మృతి వార్త తెలుసుకున్న దిల్ రాజు తక్షణం హైదరాబాద్ బయల్దేరారు. కుటుంబ సభ్యులతో ఎంతో అన్యోన్యంగా ఉండే దిల్ రాజు తన సతీమణి మృతితో దిగ్భ్రాంతికి గురయ్యారు.

ప్రస్థుతం అమెరికా నుండి హుటాహుటిన హైదరాబాద్ బయల్దేరిన దిల్ రాజు రేపు ఇక్కడికి చేరుకోనున్నారు.