దిల్ రాజు నన్ను బుద్ధుందా అని తిట్టాడు... కోపం వచ్చి అలా చేశా : సుకుమార్

First Published 9, Apr 2018, 12:38 PM IST
Dil raju fired on me that is why i did jagadam with ram
Highlights
దిల్ రాజు నన్ను బుద్ధుందా అని తిట్టాడు.

అసలు నేను 'జగడం' సినిమాను  బన్నీతో తీయాలని భావించాను. కానీ,  దిల్ రాజుతో ఒక సమస్య వచ్చి రామ్ తగ హీరోగా ఆ చిత్రాన్ని ప్రకటించేశానని సుకుమార్ చెప్పుకొచ్చాడు. రీసెంట్ ఒక చానల్ కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో సుకుమార్ ఈ ఆసక్తికర విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. 'జగడం' కథను మహేష్ బాబు లేదా అల్లు అర్జున్ లలో ఒకరిని హీరోగా అనుకుని రాసుకున్నానని, తమ్ముడి పాత్రలో రామ్ ను పెట్టుకోవాలనుకున్నాను. కానీ ఎందుకో మొత్తం మారిపోయింది.

 ఈ సినిమా ఓపెనింగ్ కు దిల్ రాజును, బన్నీని పిలిచాను, దిల్ రాజు వచ్చి, "బుద్ధుందా? ఏమి చేస్తున్నావు నువ్వు?" అని ప్రశ్నిస్తే, "నాకు కోపం వచ్చింది" అని చెప్పానని, "కోపం వస్తే సినిమా మొదలు పెడతావా?" అని చీవాట్లు పెట్టారని చెప్పుకొచ్చాడు. 'జగడం' సినిమా ఫ్లాప్ కావడంతో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో తెలిసొచ్చిందని చెప్పాడు. ఆపై మహేష్ బాబుతో తీసిన '1 నేనొక్కడినే' చిత్రం సూపర్ హిట్ అవుతుందని ఎంతో నమ్మానని, పల్లెటూర్లలో ఉన్నవారికి సినిమా అర్థం కాదన్న విషయాన్ని పట్టించుకోకనే ఫెయిల్ అయ్యానని చెప్పాడు. తాను చాలా తొందరగా ఎమోషన్స్ కు లోనవుతుంటానని, దాని నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చాడు.

loader