త్రివిక్రమ్ శ్రీనివాస్, దేవీశ్రీ మధ్య విబేధాలున్నట్లు కొంతకాలంగా పుకార్లు ఇటీవల క్రియేటివ్ డిఫరెన్సెస్ తో కలిసి పనిచేయని ఇరువురు తాజాగా బర్త్ డే శుభాకాంక్షలు చెప్పకపోవటంతో విబేధాలపై బలపడుతున్న అనుమానాలు
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఇద్దరూ టాప్ రేంజి టెక్నీషియన్స్. ఇప్పటి వరకు ఇద్దరి కాంబినేషన్ లో... నాలుగు సినిమాలకు కలిసి పని చేశారు. వీరి కాంబినేషన్లో వచ్చిన అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు కమర్షియల్‌గా మంచి విజయం సాధించాయి. అయితే ఆ తర్వాత త్రివిక్రమ్ చేసిన 'అ..ఆ' సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ మారాడు.
అ..ఆ.. చిత్రానికి మిక్కీజే మేయర్ సంగీతం అందించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సినిమాకు అనిరుధ్ రవిచందర్‌ను మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక చేసుకున్నాడు.ఒకప్పుడు కలిసి వరుస సినిమాలకు పని చేసిన త్రివిక్రమ్, దేవిశ్రీ ప్రసాద్.. మధ్య ఏదో విషయంలో విబేధాలు వచ్చాయని, అందుకే త్రివిక్రమ్ తన సినిమాలకు వేరే సంగీత దర్శకులను ఎంపిక చేసుకుంటున్నాడని అంటున్నారు.
త్వరలో ఎన్టీఆర్‌తో తీయబోయే సినిమాకు పాటలు సమకూర్చే బాధ్యత కూడా అనిరుధ్‌కే అప్పగించారు త్రివిక్రమ్. దేవిశ్రీతో క్రియేటివ్ డిఫరెన్స్ వల్లే త్రివిక్రమ్ అతడిని దూరం పెట్టారని టాక్. అయితే ఇంతకాలం ఇద్దరి మధ్య విబేధాలు ఉన్నాయనే వార్తకు పెద్దగా బలం లేదు. కానీ.. ఇటీవల జరిగిన ఓ సంఘటన ప్రతి ఒక్కరిలోనూ అనుమానాలు రేకెత్తిస్తోంది.
ఇటీవల కమల్ హాసన్, త్రివిక్రమ్ ఒకే రోజు పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇద్దరూ ఒకే రోజు పుట్టినరోజు వేడుక జరుపుకోగా కమల్ హాసన్‌ను విష్ చేసిన దేవిశ్రీ... త్రివిక్రమ్‌ను విష్ చేయలేదు. కావాలనే విష్ చేయలేదని.. ఇద్దరి మధ్య విబేధాలు ఉన్నాయనేందుకు ఇదే నిదర్శనమని ప్రచారం మొదలైంది.
త్రివిక్రమ్, దేవిశ్రీ ప్రసాద్ ఎవరి ప్రాజెక్టుల్లో వారు బిజీ బిజీగా ఉన్నారు. ఇటు పవన్ మూవీ చేస్తూనే, అటు ఎన్టీఆర్ మూవీ మొదలు పెట్టి త్రివిక్రమ్ బిజీ అయిపోయారు. రంగస్థలం, భరత్ అను నేను, ఎంసీఏ, హ్యాపీ వెడ్డింగ్ చిత్రాలకు సంగీతం అందిస్తూ దేవిశ్రీ ప్రసాద్ బిజీగా గడుపుతున్నారు.
