జాన్వీ కపూర్ 'దఢక్'పై బాలీవుడ్ సెలబ్రిటీల కామెంట్!

dhadak movie special premiere talk
Highlights

మరాఠీలో సూపర్ హిట్ అయినా 'సైరాత్' సినిమాకు రీమేక్ గా బాలీవుడ్ లో 'దఢక్' సినిమాను రూపొందించారు. ఈ సినిమాతో దివంగత శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది

మరాఠీలో సూపర్ హిట్ అయినా 'సైరాత్' సినిమాకు రీమేక్ గా బాలీవుడ్ లో 'దఢక్' సినిమాను రూపొందించారు. ఈ సినిమాతో దివంగత శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. రేపే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే బాలీవుడ్ సెలబ్రిటీల కోసం ఈ సినిమా స్పెషల్ షో వేశారు.

ఈ షోకి జాన్వీ కపూర్ ఫ్యామిలీతో పాటు కరణ్  జోహార్, అనన్య పాండే వంటి తారలు హాజరయ్యారు. షో పూర్తయిన తరువాత జాన్వీ అద్భుతంగా నటించిందంటూ ఆమె నటనను కొనియాడారు. అనీల్ కపూర్.. 'జాన్వీ, ఇషాన్ లు స్టార్స్ అయిపోయారు. తెరపై వారి నటన అందరి మనసులను దోచుకుంటుంది. ప్రతి ఒక్కరికీ నచ్చే సినిమా' అని ట్వీట్ చేశారు. అలానే సోనమ్ కపూర్ ట్విట్టర్ తన చెల్లెలిపై ప్రేమ కురిపించింది.

'జాన్వీ ఎంట్రీ అద్భుతం. చాలా గర్వంగా ఉంది. ఇషాన్ ఆకట్టుకున్నాడు. వీరిద్దరి దర్శకుడు తెరపై చూపించిన విధానానికి ధన్యవాదాలు. తెరపై ఈ జంటను చూసి అందరూ ఆశ్చర్యపోతారు' అంటూ పోస్ట్ చేసింది. శ్రీదేవి నటవారసత్వాన్ని అందిపుచ్చుకుందని మరికొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

loader