జాన్వీ కపూర్ 'దఢక్' తొలిరోజు వసూళ్లు!

dhadak movie first day collections
Highlights

తెరపై జాన్వీ, ఇషాన్ ల నటన ప్రేక్షకులను మెప్పించింది. వారి మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. అయితే మొదటిరోజే ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కొత్త నటీనటులతో తీసిన రీమేక్ కథకు ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం విశేషమనే చెప్పాలి

దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ 'దఢక్' చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే శ్రీదేవి చనిపోవడంతో తల్లిని మర్చిపోయేలా జాన్వీ తన స్థానాన్ని భర్తీ చేస్తుందని అభిమానులు ఆశ పడ్డారు.

బాలీవుడ్ ప్రముఖులు అందరూ కూడా సినిమాలో జాన్వీ నటనను కొనియాడారు. ఆమెను అభినందిస్తూ సోషల్ మీడియాలో వరుస ట్వీట్లు చేస్తున్నారు. తెరపై జాన్వీ, ఇషాన్ ల నటన ప్రేక్షకులను మెప్పించింది. వారి మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. అయితే మొదటిరోజే ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కొత్త నటీనటులతో తీసిన రీమేక్ కథకు ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం విశేషమనే చెప్పాలి.

వసూళ్ల పరంగా ఈ సినిమా తొలిరోజు రూ.8 కోట్ల 71 లక్షలు సాధించింది. లాంగ్ రన్ లో సినిమా నిర్మాతలకు మరిన్ని లాభాలను తీసుకొస్తుందని నమ్ముతున్నారు. శశాంక్ ఖైతాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను కరణ్  జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మించారు. 

loader