అక్కినేని నాగార్జున, నాని హీరోలుగా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య 'దేవదాస్' అనే సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రివీల్ చేశాడు నాగార్జున. 'సాధారణంగా నా పక్కన పారు ఉండాలి కానీ ఈ సారి దాస్ పక్కన ఇరుకున్నా' అంటూ కోపంగా ఓ ఎమోజీ పెట్టారు నాగార్జున.

ఈ సినిమా ఫన్ గా ఉంటుందని అన్నారు. నాగార్జున, నాని కలిసి ఒకే బెడ్ మీద పడుకున్న ఈ ఫొటోతో వారి పాత్రలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ముందు నుండి వినపడుతున్న వార్తల ప్రకారం సినిమాలో నాని డాక్టర్ గా దాస్ అనే క్యారెక్టర్ లో కనిపిస్తుండగా, నాగార్జున.. దేవ అనే డాన్ పాత్రలో కనిపించబోతున్నాడు. నాగ చేతిలో తుపాకీ, మందుసీసా ఉండగా.. నాని చేతిలో స్టెతస్కోప్ ఉంది.

రష్మిక, ఆకాంక్ష సింగ్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాను అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.