ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల(75)  అంత్యక్రియలు పూర్తయ్యాయి. మహాప్రస్థానంలో ఆయన భౌతికకాయానికి కుమారుడు రాజీవ్ కనకాల అంత్యక్రియలు నిర్వహించారు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దేవదాస్ హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శుక్రవారం నాడు తుదిశ్వాస విడిచారు.  శరీరంలోని పలు అవయవాలు పని చేయకపోవడంతో ఆయన మరణించినట్లు హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి.

ఆయన మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు మణికొండలోని దేవదాస్ కనకాల ఇంటికి చేరుకొని నివాళులు అర్పించారు. ప్రముఖ సినీ నటుడు చిరంజీవితో పాటు బ్రహ్మాజీ, హేమ, సమీర్ తదితరులు దేవదాస్ కనకాలకి నివాళులు అర్పించారు.

1945 జులై 30న యానాంలోని కనకాలపేటలో పాపయ్య, మహాలక్ష్మి దంపతులకు  పుట్టిన దేవదాస్ కనకాల వందకు పైగా సినిమాల్లో నటించారు. పలు సినిమాలతో పాటు టీవీ సీరియల్స్ ని తెరకెక్కించారు.  

బ్రేకింగ్ : రాజీవ్ కనకాల తండ్రి మృతి!