దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ ని రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ని విడుదల చేస్తూ 'కథానాయకుడు' అనే టైటిల్ ని రివీల్ చేశారు.

ఈ పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. వచ్చే ఏడాది జనవరి 9న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో దివిసీమ గాంధీ, మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు పాత్రలో డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దివిసీమ ఉప్పెన వచ్చిన సమయంలో మండలి కృష్ణారావు తన పదవి రాజీనామా చేసి మరీ ప్రజలకు సేవలు చేశారు. ఈ క్రమంలో అతడి పాత్రను ఆయన కొడుకు డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ పోషిస్తే బాగుంటుందని దర్శకుడు క్రిష్, బాలకృష్ణలు ఆయన్ని కోరినట్లు తెలుస్తోంది.

మా తండ్రి పాత్రని పోషించే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు.. మీ తండ్రి గారి పాత్రలో మీరు నటిస్తే బాగుంటుందని బాలకృష్ణ.. మండలి బుద్ధ ప్రసాద్ ని కోరినట్లు తెలుస్తోంది. అయితే బుద్ధప్రసాద్ మాత్రం ఎలాంటి సమాధానం చెప్పలేదని సమాచారం.  

సంబంధిత వార్త.. 

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!