డబ్బు ఇవ్వకుంటే హిస్టరీ బయటపెడతా.. నటికి బెదిరింపులు!

deepti naval blackmailed by hackers
Highlights

తాజాగా బాలీవుడ్ సీనియర్ నటి దీప్తి నావల్ అకౌంట్ కూడా హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. హ్యాకర్ ఆమె యూజర్ నేమ్, పాస్ వర్డ్ వెల్లడించి తనను డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడట. తాను అడిగిన మొత్తాన్ని చెల్లించకపోతే బ్రౌజింగ్ హిస్టరీ మొత్తాన్ని బయట పెడతానని బెదిరించాడట

సెలబ్రిటీల ఖాతాలు హ్యాక్ చేయడం, వాటిని అడ్డు పెట్టుకొని వారిని బెదిరించడం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే ఇండస్ట్రీలో కొందరు సెలబ్రిటీల ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్లు హ్యాక్ అయిన సంగతి తెలిసిందే. సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్, అలానే అమృత సింగ్ ల ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు హ్యాక్ చేశారు.

తాజాగా బాలీవుడ్ సీనియర్ నటి దీప్తి నావల్ అకౌంట్ కూడా హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. హ్యాకర్ ఆమె యూజర్ నేమ్, పాస్ వర్డ్ వెల్లడించి తనను డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడట. తాను అడిగిన మొత్తాన్ని చెల్లించకపోతే బ్రౌజింగ్ హిస్టరీ మొత్తాన్ని బయట పెడతానని బెదిరించాడట. 5,600 డాలర్లను బిట్ కాయిన్ రూపంలో చెల్లించమని డిమాండ్ చేశారట.

24 గంటల్లో డబ్బు ఇవ్వాలని లేదంటే హిస్టరీ బయట పెడతామని హెచ్చరించారట. అయితే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది దీప్తి నావల్. అయితే పోలీసులు మాత్రం ఇదంతా ట్రాష్ అని కొట్టి పారేస్తున్నారు. ఈమెయిల్ ను పట్టించుకోవద్దని, చాలా మందికి ఈ తరహా మెయిల్స్ వస్తున్నాయని తెలిపారు. 

loader