బాలీవుడ్ అందాల భామ దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ లు గత కొన్ని రోజులుగా ప్రేమాయణం సాగిస్తున్నారు. ఈ జంట త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం వీరి పెళ్లి త్వరలోనే ఉండబోతోందని తెలుస్తోంది. అందుకే తన సొంత నగరమైన బెంగుళూరు వచ్చిన దీపిక ఇటీవల తన తల్లితో కలిసి భారీ ఎత్తున వెడ్డింగ్ జ్యువెల్లరీ కొనుగోలు చేసిందట. దాంతో దీపిక వివాహం త్వరలోనే జరుగుతుందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

 

దీపిక పదుకోనె ప్రస్తుతం విశాల్ భరద్వాజ్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ముఖ్యమైన పాత్రలో చేస్తున్నాడు. అయితే ఇర్ఫాన్ ఖాన్ అరుదైన వ్యాధిభారిన పడి లండన్లో చికిత్స తీసుకుంటుండటంతో షూటింగ్ ఆగిపోయింది. దీంతో ఖాళీగా ఉన్న దీపిక పదుకోనె.. బెంగళూరు వచ్చి పెళ్లి షాపింగ్ ప్రారంభించిందని టాక్. బిజీ షెడ్యూల్ వల్ల తర్వాత సమయం ఉంటుందో? లేదో? అని భావించిన దీపిక షాపింగ్ తో మొదలుపెట్టి పెళ్లికి సంబంధించిన పనులు పూర్తి చేసే పనిలో పడింది.

 

బెంగుళూరులోని ప్రముఖ నగల దుకాణాలను తన తల్లి, చెల్లి అనిషా పదుకోన్‌తో కలిసి దీపిక సందర్శించి భారీ ఎత్తున కోనుగోళ్లు జరిపారట. కాగా... పెళ్లి తర్వాత బెంగుళూరులో రిసెప్షన్ పార్టీ జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారట. మరో పక్క దీపికా, రణ్వీర్ తమ రిలేషన్ షిప్ గురించి ఇంకా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు. వీరి పెళ్లి కూడా ప్రైవేట్ సెర్మనీగా రహస్యంగా జరిగే అవకాశం ఉందని, కోహ్లి-అనుష్క వివాహం తరహాలోనే.. పెళ్లి తర్వాత ఫోటోలు విడుదల చేసి మీడియాకు విషయం తెలియజేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.

 

దీపిక పేరెంట్స్ కొద్దిరొజుల క్రితం ముంబై వచ్చి రణ్వీర్ కుటుంబ సభ్యులతో కలిసి వెడ్డింగ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అది ఎప్పుడు అనే విషయం ఇంకా బయటకు రాలేదు. ఇటీవలే ముంబైలోని దీపిక నివాసంలో... దీపిక పేరెంట్స్, రణవీర్ పేరెంట్స్ కలుసుకున్నారని, అంతా కలిసి డిన్నర్ చేసినట్లు వార్తలు వనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు బట్టి చూస్తే త్వరలోనే అభిమానులు వీరి పెళ్లి వేడుక చూడబోతున్నారని స్పష్టమవుతోంది.