హిరోయిన్ల‌లో అత్య‌ధిక పారితోషికం తీసుకుంటున్న దీపిక‌పదుకునే పద్మావతి సినిమా కోసం12 కోట్లపారితోషకం తీసుకున్న దీపిక పదుకునే
బాలీవుడ్ లో నంబర్ వన్ హీరోయిన్ .అత్యంత క్రేజ్ ఉన్న నటీమణి, ఏసియాస్ సెక్సీయెస్ట్ వుమన్ తదితర ఘనతలు సొంతం చేసుకున్న దీపిక ఇప్పుడు పారితోషకం విషయంలో తనకే సాధ్యమైన ఫీట్ ను సాధించిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
పన్నెండు కోట్ల రూపాయలు… అంటే ఇది బాలీవుడ్ లో చాలా మంది హీరోలు ఒక్కో సినిమాకూ అందుకుంటున్న పారితోషకం కన్నా చాలా ఎక్కువ హీరో స్వామ్యం అయిన బాలీవుడ్ లో ఈ విధంగా ఒక హీరోయిన్ హీరోల కన్నా ఎక్కువ స్థాయి రెమ్యూనరేషన్ తీసుకోవడం అంటే.. గొప్ప మార్పే, స్త్రీ సాధికరతకు కూడా ఇదొక నిదర్శనం అవుతుందనే మాట వినిపిస్తోంది
‘పద్మావతి’ సినిమా విషయంలో కూడా ఇందులో హీరోలుగా నటిస్తున్న వారు తీసుకుంటున్న పారితోషకం కన్నా కూడా దీపిక పొందుతున్నది ఎక్కువే! మొత్తానికి ఈమె ఈ విధంగా దూసుకుపోతోంది
