సంజయ్ లీలా భన్సాలీ `రామ్-లీలా` మూవీలో దీపికా పదుకొణె ఫస్ట్ అనుకున్న హీరోయిన్‌ కాదు. మరి మొదట అనుకున్న హీరోయిన్‌ ఎవరు? దీపికా ఎలా వచ్చిందంటే?

రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె కలిసి నటించిన సంజయ్ లీలా భన్సాలీ సినిమా `గోలియోం కి రాసలీలా రామ్-లీలా` బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పట్లో వస్తే ఈ మూవీ వెయ్యి కోట్ల సినిమా అయ్యేది. ఈ సినిమాలో నటీనటుల ఎంపిక గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు. కానీ ఆ సినిమా డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ మొదట హీరోయిన్ కోసం ఇద్దరు స్టార్ హీరోయిన్లను అనుకున్నారని మీకు తెలుసా?

`రామ్‌ లీలా` మూవీలో మొదట అనుకున్న హీరోయిన్‌ ప్రియాంక చోప్రా..

ముందు కరీనా కపూర్ ఖాన్‌ను హీరోయిన్‌గా అనుకున్నారట. తర్వాత లీలా పాత్ర కోసం ప్రియాంక చోప్రాను తీసుకున్నారు. కానీ చివరి నిమిషంలో హీరోయిన్‌గా దీపికా పదుకొణెను మార్చేశారు. రామ్ లీలాలో ఫస్ట్ ప్రియాంక చోప్రాను హీరోయిన్‌గా తీసుకోవాలని డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ అనుకున్నారట. కానీ ఆఖరికి దీపికా పదుకొణెను తీసుకున్నారు. ప్రియాంకకు `రామ్ చాహే లీలా` ఐటెం సాంగ్‌లో అవకాశం ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు.

`రామ్‌ లీలా`లో చివరి నిమిషంలో ప్రియాంకని తొలగించి దీపికా పదుకొనెని తీసుకున్నారు..

ఇటీవల లెహ్రెన్ రెట్రోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక వాళ్ల అమ్మ మధు చోప్రా ఈ విషయం చెప్పారు. భన్సాలీ గురించి ఏం బాధపడలేదని, హీరోయిన్‌ను మార్చిన తర్వాత కూడా ఆయన వెంటనే మళ్లీ అవకాశం ఇచ్చారని అన్నారు.

ఆ టైంలో నాకు సరిగ్గా గుర్తులేదు. నేను క్లినిక్‌లో పేషెంట్లతో ఉన్నప్పుడు ప్రియాంక,, భన్సాలీ ఆఫీసుకు వెళ్లిందని నాకు తెలుసు. తిరిగి వచ్చిన తర్వాత రామ్ లీలాలో ఒక పాట మాత్రమే చేస్తున్నానని చెప్పింది. ఏమైందని నేను అడిగాను. ప్రియాంక అదంతా మంచిదే అని నేను అనుకుంటున్నాను అని చెప్పిందని మధు చోప్రా ఆ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.

read  more: హీరోయిన్‌ శ్రీదేవి సిస్టర్‌ సినిమాల్లోకి ఎందుకు రాలేదు? ఇప్పుడు ఏంచేస్తుందో తెలుసా?

`మేరీకోమ్‌, `బజీరావ్‌ మస్తానీ`లో ప్రియాంకకి ఛాన్స్.. 

 డైరెక్టర్‌తో మాట్లాడిన తర్వాత ప్రియాంక బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అని మధు చెప్పారు. ఆ తర్వాత భన్సాలీ ప్రియాంకకు `మేరీ కోమ్` సినిమాలో అవకాశం ఇచ్చారు.

`బజీరావ్ మస్తానీ`లో ప్రియాంక నటన గురించి మధు మాట్లాడుతూ.. కాశీబాయి పాత్రలో నటించడం చాలా కష్టం. ఎందుకంటే చాలా క్లోజ్ షాట్స్ ఉన్నాయి, అన్నీ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్‌తోనే చేయాలి. భన్సాలీ అంత ఈజీగా ఒప్పుకునే డైరెక్టర్ కాదు, ఆయనను మెప్పించి సంతోషపెట్టడమే లక్ష్యంగా ఉండేదని చెప్పారు.

ప్రియాంక చోప్రా మహేష్‌-రాజమౌళి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ..

ప్రియాంక ఇప్పుడు 'ది బ్లఫ్' సినిమాలో నటిస్తోంది. అమెరికన్ యాక్షన్ కామెడీ 'హెడ్స్ ఆఫ్ స్టేట్'లో కూడా కనిపించనుంది. దీంతోపాటు తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ మహేష్‌, రాజమౌళి మూవీలో నటిస్తుంది. ఇందులో ఆమెది కీలక పాత్ర అని, నెగటివ్‌ షేడ్‌ ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది.

read more: పెళ్లైనా సోనాలిని ప్రేమిస్తూనే ఉన్న పొలిటీషియన్‌ ఎవరో తెలుసా? 30 ఏళ్ల తర్వాత కలిసి సైగలు.. వీడియో వైరల్

also read: ఉదయ్‌ కిరణ్‌ మోకాళ్లు పట్టుకుని ఏడ్చాడు, లాగిపెట్టి కొట్టేదాన్ని.. షాకింగ్‌ విషయాలు బయటపెట్టిన సీనియర్‌ నటి