ఒకప్పుడు రిలేషన్లో ఉన్న నటి సోనాలి బెంద్రే, రాజకీయ నాయకుడు రాజ్ థాకరే 30 ఏళ్ల తర్వాత కలిశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇందులో సోనాలి చేసిన పని రచ్చ అవుతుంది.
మొదటి ప్రేమను ఎవరూ మర్చిపోలేరు అంటారు. ఆ మాట బాలీవుడ్ నటి సోనాలి బెంద్రే, రాజకీయ నాయకుడు రాజ్ థాకరే విషయంలో నిజమైంది. వీళ్లిద్దరూ కలిసింది 30 ఏళ్ల తర్వాత! వీళ్లిద్దరూ ఒకప్పుడు ప్రేమికులు అనే విషయం చాలా మందికి తెలీదు. మహారాష్ట్రలో జరిగిన మరాఠీ భాషా దినోత్సవం రోజున వీళ్లిద్దరూ కలిశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
మాజీ ప్రియుడు రాజ్ థాకరేని రమ్మంటూ సోనాలి బింద్రే సైగలు..
ఆ వీడియోలో సోనాలి బెంద్రే తన కళ్లతో రాజ్ థాకరేను తనతో రమ్మన్నట్లుగా సైగ చేసింది. అయితే దీని వెనుక ఒక కథ ఉంది. సోనాలి బింద్రే హీరోయిన్గా రాణించే సమయంలో రాజ్ పెళ్లయినా ఆమెని ప్రేమించేవాడు. సోనాలి కూడా రాజ్‌ను ప్రేమించింది. కానీ వాళ్లిద్దరూ ఒక్కటి కాలేకపోయారు. చాలా మీడియా కథనాల ప్రకారం సోనాలి బెంద్రే, రాజ్ థాకరే ఒకరినొకరు పిచ్చిగా ప్రేమించుకున్నారు.
సోనాలి బింద్రే, రాజ్ థాకరే ప్రేమని వ్యతిరేకించిన బాల్ థాకరే..
బాలీవుడ్లో సోనాలి కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లినది రాజే. కానీ వాళ్ల బాబాయి బాల్ థాకరేకు ఈ విషయం తెలిసినప్పుడు ఈ సంబంధాన్ని ఆయన వ్యతిరేకించారు. సోనాలికి దూరంగా ఉండమని చెప్పారు. రాజ్ థాకరే సోనాలిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు బాల్ థాకరే వద్దని సలహా ఇచ్చారు. ఎందుకంటే అది ఆయన రాజకీయ జీవితంపై చెడు ప్రభావం చూపుతుంది. అంతేకాదు రాజ్ అప్పటికే షర్మిలా థాకరేను పెళ్లి చేసుకున్నాడు.
సోనాలితో ప్రేమలో ఉన్న నాటికి రాజ్ థాకరేకి మ్యారేజ్
రాజ్ తన రాజకీయ జీవితం కోసం ఈ సంబంధాన్ని తెంచుకున్నాడు. ఇదిలా ఉంటే సోనాలి బెంద్రే మరాఠీ భాషా కార్యక్రమంలోని కొన్ని ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలతో పాటు "మరాఠీ ప్రపంచంలోని గొప్ప వ్యక్తులతో ఈ ప్రత్యేక క్షణాన్ని పంచుకునే అవకాశం ఇచ్చినందుకు రాజ్ థాకరేకు ధన్యవాదాలు" అని రాసింది. ఈ గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. మరాఠీ సాహిత్యంలో పాల్గొనడానికి ఇది మంచి అవకాశం. మరాఠీ పుస్తక ప్రదర్శనకు వెళ్లి మీ భాష యొక్క గొప్పతనాన్ని అనుభవించండి అని చెప్పింది. ప్రస్తుతం ఆమె పోస్ట్, అలాగే ఇందులో రాజ్‌ని రమ్మంటూ ఆమె సైగలు చేసిన తీరు చాలా రొమాంటిక్‌గా ఉంది. ఇదే ఇప్పుడు వైరల్ అవుతుంది. నెటిజన్లు పెద్ద రచ్చ చేస్తున్నారు.