బాహుబలికి మరో సవాల్ విసిరిన దంగల్ మూవీ దేశవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో రిలీజైన బాహుబలి విదేశీ గడ్డ చైనాలో రికార్డ్ నంబర్ 9000 థియేటర్స్ లో రిలీజైన దంగల్

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన 'దంగల్' సినిమా ఈరోజు చైనాలో భారీ ఎత్తున విడుదలైంది. దాదాపు 9000 థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేశారు. ఇలా భారీ ఎత్తున విడుదల చేసిన విషయాన్ని స్వయంగా ఆ సినిమా నిర్మాతలే వల్లడించారు. విదేశీగడ్డపై ఓ భారతీయ చిత్రం ఇన్ని థియేటర్లలో విడుదల కావడం ఇదే ఫస్ట్ టైమ్. చైనాలో మొత్తం 40 వేల థియేటర్లు ఉండగా.. అందులో 25శాతం థియేటర్లలో దంగల్ సినిమా ఆడుతున్నదన్నమాట. గత నెలలో ఈ సినిమాను బీజింగ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు.

ఇక దీంతో దేశవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో రిలీజైన బాహుబలి మొత్తం 8000 థియేటర్స్ లో రిలీజ్ అయిన నేపథ్యంలో..దంగల్ ఈ సరికొత్త రికార్డు నంబర్ బాహుబలి రిలీజ్ చేసిన థియేటర్ నంబర్ కు మించిపోయి సవాల్ విసురుతోంది.