మెగాస్టార్‌ చిరంజీవి హీరగా `విశ్వంభర` చిత్రం రూపొందుతుంది. ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్‌ అండ్‌ క్రేజీ అప్‌డేట్‌ తెరపైకి వచ్చింది.  

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం సోషియో ఫాంటసీ ఎలిమెంట్లతో రూపొందుతున్న `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. `బింబిసార` ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందుతుంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇందులో త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. ఆమెతోపాటు భారీ కాస్టింగ్‌ యాడ్‌ అవుతుంది.

అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇందులో మెగాస్టార్‌ చిరంజీవి డ్యూయెల్‌ రోల్‌లో కనిపిస్తారట. ఆయన పాత్రలో రెండు రకాల షేడ్స్ ఉంటాయని తెలుస్తుంది. అంతేకాదు ఆయనకు జోడీగా నటిస్తున్న త్రిషది కూడా డ్యూయెల్‌ రోలే అని సమాచారం. ఆమె కూడా రెండు రకాల పాత్రల్లో కనిపిస్తుందని అంటున్నారు. ఫాంటసీ ఎలిమెంట్లలో ఓ గెటప్‌లో, అలాగే సోషల్‌ ఎలిమెంట్లలో మరో గెటప్‌లో కనిపిస్తారని టాక్‌. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా త్రిషతోపాటు ఆయనకు చెల్లెళ్లుగా ఐదుగురు భామలు కనిపించబోతున్నారట. ఆషికా రంగనాథ్‌, సురభి, ఇషాచావ్లా సినిమా మొత్తం ఉంటారని,అలాగే మృణాల్‌ ఠాకూర్‌, మీనాక్షిచౌదరి గెస్ట్ లుగా కనిపిస్తారని తెలుస్తుంది. వీరితోపాటు రాజ్‌ తరుణ్‌, నవీన్‌ చంద్రలు కీలకపాత్రల్లో మెరవబోతున్నారట. ఇలా భారీగా కాస్టింగ్‌ యాడ్‌ అవుతున్నట్టు సమాచారం. 

ఇక ఈ మూవీని సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ చాలా భారీగా, ప్రతిష్టాత్మకంగా దీన్ని తెరకెక్కిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవలే ఓ సాంగ్‌ని షూట్‌ చేశారట. మరో షెడ్యూల్‌కి రెడీ అవుతున్నారట.

read more: ఒక్క సీన్‌ కోసం చిరంజీవిని మూడు నెలలు వెయిట్‌ చేయించిన బాబుమోహన్‌.. మెగాస్టార్‌ కోపం ఏ రేంజ్‌లో అంటే..