- Home
- Entertainment
- ఒక్క సీన్ కోసం చిరంజీవిని మూడు నెలలు వెయిట్ చేయించిన బాబుమోహన్.. మెగాస్టార్ కోపం ఏ రేంజ్‌లో అంటే..
ఒక్క సీన్ కోసం చిరంజీవిని మూడు నెలలు వెయిట్ చేయించిన బాబుమోహన్.. మెగాస్టార్ కోపం ఏ రేంజ్‌లో అంటే..
కమెడియన్ బాబుమోహన్ తనదైన కామెడీతో నవ్వులు పూయించారు. కానీ ఆయన మెగాస్టార్‌కి మాత్రం కోపం తెప్పించారు. ఒక్క సీన్ కోసం మూడు నెలలు వెయిట్ చేయించాడట.

బాబుమోహన్ ఒకప్పుడు బిజీ ఆర్టిస్ట్. కమెడియన్‌గా ఆయన వందల సినిమాలు చేశారు. దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ నటించాడు. బాబుమోహన్, బ్రహ్మానందం లేని సినిమాలు లేవంటే అతిశయోక్తి కాదు. అలాగే బాబుమోహన్, కోట శ్రీనివాసరావు కాంబినేషన్ కోసం బాగా పేలేది. కమెడియన్‌తో ఆద్యంతం నవ్వులు పూయించారు బాబుమోహన్.
అయితే ఆయన కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో మూడు షిఫ్ట్ లు వర్క్ చేసేదట. కనీసం నిద్ర పోయే టైమ్ కూడా ఉండేది కాదని, తిండి కూడా సరిగా తినలేకపోయేవాళ్లమని ఓ ఇంటర్వ్యూలో బాబు మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసుకున్నారు. ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో బాబుమోహన్ మాట్లాడుతూ, చిరంజీవికి కోపం తెప్పించిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.
90లో దాదాపు అందరు హీరోలు పీక్‌లో ఉన్నారు. ఏకకాలంలో రెండు మూడు సినిమాలు చేసిన సందర్భాలున్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి సూపర్ ఫామ్‌లో ఉన్నారు. `ముఠామేస్త్రీ` టైమ్‌లో ఆయన టాప్ స్టార్‌గా రాణిస్తున్నారు. అయితే ఈ మూవీలో బ్రహ్మానందం, బాబుమోహన్‌లతో చిరుకి కాంబినేషన్ సీన్లు ఉన్నాయట. దాదాపు అన్ని సీన్లు పూర్తయ్యాయి. క్లైమాక్స్ ఒక ట్విస్ట్ ఇచ్చే సీన్ ఉంది. దానికోసం ఏకంగా మూడు నెలలు వెయిట్ చేశారట.
బాబుమోహన్, బ్రహ్మానందం కూడా చాలా బిజీగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే హీరోలకంటే కమెడియన్లే ఫుల్ బిజీగా ఉంటారు. ఒకేసారి నాలుగైదు సినిమాలు చేస్తుంటారు. పైగాస్టార్లతో కాంబినేషన్ సీన్లు ఉంటాయి. ఈ క్రమంలో షూటింగ్‌లకు డేట్స్, టైమ్ అడ్జెస్ట్ చేయడం చాలా కష్టం. అదే సమస్య చిరంజీవి `ముఠామేస్త్రీ`కి వచ్చిందట. క్లైమాక్స్ లో బాబుమోహన్, బ్రహ్మానందంలో చేయాల్సిన ఒక్క సీన్ కోసం మూడు నెలలు వెయిట్ చేశారట చిరంజీవి.
ఈ రోజు, ఆ రోజు అంటూ రోజులు గడిచిపోతున్నాయి, అయినా షూటింగ్ కి రావడం లేదు. దీంతో ఇక చిరంజీవికి కోపం వచ్చిందట. రెండు గంటలేగా అంటూ గట్టిగా రోజున 4-6ఏఎం టైమ్ ఇవ్వాలన్నారు. అది తెల్లవారు జామున నాలుగు గంటలకు. చిరంజీవి కోపాన్ని చూసి బాబుమోహన్‌కి తన షూటింగ్ అడ్జెస్ట్ చేసుకుని వచ్చారట. చిరంజీవి వచ్చే వరకు కాసేపు కునుకు తీద్దామని భావించాడట బాబుమోహన్. కానీ చెట్టుకింద చూస్తే కుర్చీలో అప్పటికే చిరంజీవి రెడీగా ఉన్నారట.
బాబుమోహన్‌ని నిద్రలేని పరిస్థితిలో చూసి చిరుకి బాధ కలిగిందట. బ్రెష్ వేసుకోమని ఇంటి నుంచి ప్రత్యేకంగా దోషాలు చేయించి తెప్పించారట. ఆయన ఆకలితో ఆ దోశలు తింటుంటే చిరంజీవికి ఎంతో ఆనందం, అదే సమయంలో బాధ కలిగింది. ఎందుకంటే తనకు కూడా అలానే తినాలని ఉంటుందని, కానీ హీరో కావడంతో అలా తినలేమని చెబుతూ చాలా బాధ పడ్డాడట చిరంజీవి. తాజాగా తెలుగు వన్ ఇంటర్వ్యూలో బాబుమోహన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఒక్క సీన్ కోసం చిరు అన్న మూడు నెలలు వెయిట్ చేశారని తెలిపారు చిరు అన్న అంటే తనకు ఇష్టమని, ఆయనతో సినిమా చేస్తే ఎంతో సరదాగా ఉంటుందన్నారు. కానీ తాము ఆ సమయంలో ఫుల్ బిజీగా ఉండేవాళ్లమని అందరి పరిస్థితి అలానే ఉండేదన్నారు. అలా ఓ పదేళ్ల పాటు సాగిందన్నారు.