Asianet News TeluguAsianet News Telugu

క్రేజీ బజ్ ప్రభాస్ విలన్ గా మాలీవుడ్ స్టార్!

సలార్ చిత్రానికి సంబంధించిన క్రేజీ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ సలార్ చిత్రంలో విలన్ రోల్ చేస్తున్నారట. 

crazy buzz malayala star prudhviraj to play opposite for prabhas in salaar
Author
Hyderabad, First Published Oct 20, 2021, 9:47 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ప్రభాస్ ప్రకటించిన ప్రతి చిత్రం ఓ సెన్సేషన్. దేశంలోనే భారీ చిత్రాల హీరోగా మారిన ప్రభాస్ మూవీ అప్డేట్స్ చిత్ర వర్గాలతో పాటు ఫ్యాన్స్ ని విస్మయ పరిచేవిగా ఉంటున్నాయి.  Prabhas నటిస్తున్న చిత్రాలలో సలార్ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కెజిఎఫ్ చిత్రంతో ఇండియా మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న ప్రశాంత్ నీల్ దర్శకుడు కావడంతో హైప్ మరింతగా పెరింది. యాభై శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న Salaar 2022 సమ్మర్ కానుకగా విడుదల కానుంది. 

కాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ సలార్ చిత్రంలో విలన్ రోల్ చేస్తున్నారట. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. ప్రభాస్ లాంటి మాస్ హీరోకి విలన్ గా Prudhviraj చేయడం అంటే.. సినిమాకు కలిసొచ్చే అంశమే. అదే సమయంలో ప్రభాస్, పృథ్విరాజ్ మధ్య వచ్చే సన్నివేశాలు ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలిగించడం ఖాయం. 


పాన్ ఇండియా మూవీగా పలు బాషలలో విడుదల కానున్న సలార్ కోసం వివిధ పరిశ్రమలకు చెందిన నటులను ఎంపిక చేస్తున్నట్లు అర్థం అవుతుంది. మరో టాలెంటెడ్ నటుడు జగపతి బాబు సలార్ లో కీలక రోల్ చేస్తుండగా ఆయన లుక్ విడుదల చేశారు. ఇక శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. KGF చిత్రానికి నిర్మాతలుగా ఉన్న హోమబుల్ ఫిలిమ్స్ సలార్ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. 

Also read హాట్ టాపిక్: భార్యా,భర్తలిద్దరూ ప్రభాస్ కు విలన్స్ గా మారారట
మరోవైపు ప్రభాస్ బర్త్ డే గ్రాండ్ గా సెలెబ్రేట్ చేయనున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే సోషల్ మీడియాలో సందడి మొదలుకాగా, Prabhas birthday ట్యాగ్స్ భారీగా ట్రెండ్ చేస్తున్నారు. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే పురస్కరించుకొని ఆయన చిత్రాలకు సంబంధించిన అప్డేట్స్ రానున్నాయి. ముఖ్యంగా రాధే శ్యామ్ టీజర్ విడుదల కానుందని ప్రచారం జరుగుతుంది. 

Also read ప్రభాస్ బర్త్ డే సీడీపీ... ఇండియా లెవెల్ లో ట్రెండ్ చేస్తున్న ఫ్యాన్స్!
ఇక ఆదిపురుష్ చిత్రీకరణలో పాల్గొంటున్న ప్రభాస్ దర్శకుడు నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ కె ప్రకటించారు. ఇటీవల అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో Spirit మూవీ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. రానున్న మూడు నాలుగేళ్లలో ప్రభాస్ నుండి భారీ ప్రాజెక్ట్స్ విడుదల కానున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios