హాట్ టాపిక్: భార్యా,భర్తలిద్దరూ ప్రభాస్ కు విలన్స్ గా మారారట

 ప్రభాస్ కాల్ షీట్లు రానున్న మూడు సంవత్సరాల వరకు ఖాళీగా లేదు. ఇప్పటికే తన చేతిలో నాలుగు పాన్ ఇండియా సినిమాలు ఉన్నా.. తాజాగా సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అనే చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. అయితే ఇందులో నటించే నటీనటుల గురించి ఇప్పటివరకు ఏ అప్డేట్ రాకపోయినా ఇందులో విలన్‌గా కరీనా కనిపించబోతుందని టాక్ వినిపిస్తోంది.

 

Kareena Kapoor as Villain in Prabhas  Film

రజనీకాంత్ తర్వాత సౌత్ నుంచి ఏకైక ప్యాన్ ఇండియా స్టార్ ప్రబాస్. ప్రస్తుతం ప్రభాస్ స్టార్డమ్ ఎలా ఉందంటే బాలీవుడ్ స్టార్స్ ఆయన సినిమాల్లో చేయటానికి ఉత్సాహం చూపేటంత. అందుకే ఇప్పుడు బాలీవుడ్ నటీనటులతో ఆయన సినిమాలు నిండిపోతున్నాయి. ఈ క్రమంలో ఆయన హీరోగా చేస్తే విలన్ పాత్రలు బాలీవుడ్ వాళ్లు చేస్తున్నారు. అయితే అందులో వింతేముంది మన తెలుగు హీరోలు చాలా మందికి బాలీవుడ్ నటులు విలన్స్ గా చేస్తున్నారు కదా అనొచ్చు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే బాలీవుడ్ జంట..మొగుడు పెళ్లాం ఇద్దరూ ఆయనకు విలన్స్ గా చెయ్యటం.

వివరాల్లోకి వెళితే... ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఆది పురుష్ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా అంటే రావణుడు పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన పాత్ర షూటింగ్ కూడా పూర్తైంది. ఇప్పుడు ఆయన భార్య కరీనా కపూర్ ... ప్రభాస్ తాజా చిత్రం స్పిరిట్ లో విలన్ గా చేయబోతోందని బాలీవుడ్ తాజా న్యూస్. 

రెబల్ స్టార్ ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా.. సాలిడ్ కాంబినేషన్ కుదిరింది. పాన్ ఇండియా స్టార్, పాన్ ఇండియన్ డైరెక్టర్‌ల కలయికలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టింది టీ-సిరీస్ సంస్థ. ప్రభాస్ కెరీర్‌లో 25వ సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి. పాన్ ఇండియన్ స్థాయిలో భారీ బడ్జెట్‌తో టీ-సిరీస్, భ‌ద్ర‌కాళీ పిక్చ‌ర్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటినుండి సోషల్ మీడియాలో రోజుకో కొత్త వార్త వైరల్ అవుతోంది. డార్లింగ్ ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్‌ క్యారెక్టర్ చెయ్యనున్నారని అంటున్నారు.

also read: ప్రభాస్‌ ఆవిష్కరించిన `రొమాంటిక్‌` ట్రైలర్‌.. పాన్‌ ఇండియా స్టార్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్

 అలాగే ఈ మూవీకి గానూ ప్రభాస్ దాదాపు 150 కోట్లు రెమ్యునేషన్ గా తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ హైలెట్ అని, అందులోనూ అది లేడీ విలన్ రోల్ అని ఆ పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ నటి కరీనా కపూర్‌ని అనుకుంటున్నారని నెట్టింట క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios