దంపతుల మృతి

సినీ హీరో అక్కినేని నాగార్జున కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో విషాదం చోటుచేసుకుంది. అక్కడ పనిచేసే ఇద్దరు దంపతులు కరెంట్ షాక్ కొట్టి మృత్యువాత పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా బొబ్బిడవరం మండలం కొత్తలంకకు చెందిన వెంకటరాజు(36), దుర్గ(32) దంపతులు. వారు కేశంపేట మండలంలోని పాపిరెడ్డిగూడ శివారులో గల సినీహీరో నాగార్జునకు చెందిన వ్యవసాయం క్షేత్రంలో పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

ఆదివారం రాత్రి ఇంట్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో పొలంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను పరిశీలించడానికి వెంకటరాజు వెళ్లాడు. తెగిపడిన విద్యుత్‌ వైరును గమనించకపోవడంతో అది తగిలి విద్యుదాతానికి గురయ్యాడు. దుర్గ గమనించి భర్తను కాపాడే ప్రయత్నం చేసింది. కాగా ఈ ప్రయత్నంలో ఆమె కూడా విద్యుదాఘాతానికి గురయ్యారు. దీంతో.. దంపతులు ఇద్దరూ తనువు చాలించారు.