అక్కినేని నాగచైతన్య హీరోగా దర్శకుడు చందు మొండేటి 'సవ్యసాచి' సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ట్రైలర్ ని బట్టి సినిమాలో హీరో ఎడమ చేయి మరొక వ్యక్తిలాగా పనిచేస్తుంటుంది.

ట్రైలర్ మొత్తం చాలా ఆసక్తికరంగా సాగింది. నవంబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా కాపీ అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తరువాత సినిమాలకు సంబంధించిన ఇలాంటి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.

'సవ్యసాచి' సినిమా తమిళంలో గతేడాది విడుదలైన 'పీచాంకై' అనే సినిమాకి దగ్గరగా ఉందని కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. 'పీచాంకై' సినిమాలో హీరోకి కూడా తన ఎడమ చేయి కంట్రోల్ లో ఉండదు. దానికి నచ్చినట్లుగా అది ప్రవర్తిస్తుంటుంది. 

అయితే ఈ సినిమాని మొత్తం కామెడీ యాంగిల్ లో దర్శకుడు ప్రెజంట్ చేశాడు. కానీ 'సవ్యసాచి' సినిమా మాత్రం యాక్షన్, థ్రిల్లర్ జోనర్ లో సాగనుంది. మరి ఈ సందేహాలు తీరాలంటే మరో వారం రోజులు ఎదురుచూడాల్సిందే!

ఇవి కూడా చదవండి.. 

'సవ్యసాచి' ట్రైలర్: పద్మవ్యూహంలో అభిమన్యుడిలా కాదు.. అర్జునుడిలా!

'సవ్యసాచి' నుండి ఫస్ట్ సింగిల్ 'వై నాట్' సాంగ్!

ఒకే రక్తం, ఒకే శరీరం పంచుకొని పుడితే.. 'సవ్యసాచి' టీజర్!