హీరో నాగచైతన్య అక్కినేని, హ్యాట్రిక్ డైరెక్టర్ చందు మొండేటిల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ "సవ్యసాచి". మైత్రీమూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగచైతన్య సరసన కథానాయికగా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. మాధవన్, భూమికలు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమా పోస్టర్లు, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. తాజాగా సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్ ని మరింత ఆసక్తికరంగా కట్ చేశారు. 
'ప్రేమ,కోపం లాంటి ఎమోషన్స్ మీకొస్తే.. మీరు మాత్రమే రియాక్ట్ అవుతారు.. అదే నాకొస్తే నాతో పాటు ఇంకొకడు కూడా రియాక్ట్ అవుతాడు.. నా ఎడం 
చేయి..' అంటూ చైతు చెప్పే డైలాగ్ అతడి క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనే విషయాన్ని చెప్పకనే చెబుతుంది.

నాగచైతన్యని చూస్తూ సినిమాలో విలన్ మాధవన్ 'వాడిని చూస్తుంటే పద్మవ్యూహంలో అభిమన్యుడిలా ఉన్నాడు కదూ..' అని తాగుబోతు రమేష్ తో అనగా దానికి అతడు 'మీది పద్మవ్యూహమే సర్ కానీ అతడిని చూస్తుంటే అభిమన్యుడిలా కాదు.. అర్జునుడిలా ఉన్నాడు' అంటూ చెప్పే మాటలు ఆకట్టుకున్నాయి.

 'చావైనా నిన్ను చేరాలంటే అది నీ ఎడం చేయి దాటి నిన్ను రావాలి..' అంటూ రావు రమేష్ పలికిన డైలాగ్ సినిమాలో హీరో పాత్ర ఎంత బలంగా  ఉండబోతుందే తెలిసేలా చేస్తుంది. 'సవ్యసాచి' అంటూ సాగే నేపధ్య సంగీతం ట్రైలర్ కి హైలైట్ గా నిలిచింది.