బాలీవుడ్ కమెడియన్ వీర్ దాస్ (Comedian Vir Das) మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారాడు. నేను రెండు ఇండియాల నుంచి వచ్చాను’ (I come from two Indias) అని అతడు విదేశీ గడ్డపై పేర్కొనడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  


బాలీవుడ్ కమెడియన్ వీర్ దాస్ (Comedian Vir Das) మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారాడు. అందుకు అతడు యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన వీడియోనే కారణం. వాషింగ్టన్‌ డీసీలోని జాన్ ఎఫ్ కెనడీ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్స్‌ ఆర్ట్స్‌లో మాట్లాడిన వీర్ దాస్ ‘నేను రెండు ఇండియాల నుంచి వచ్చాను’ (I come from two Indias) పేర్కొన్నాడు. అయితే పలు అంశాలను ప్రస్తావించిన Vir Das.. అందుకు సంబంధించి ఇండియాలో రెండు కోణాల ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ‘ఒక ఇండియాలో పగటిపూట స్త్రీలను పూజిస్తారని, మరో ఇండియాలో రాత్రి పూట అత్యాచారాలు జరుగుతాయని.. అక్కడి నుంచి తాను వచ్చాను’ అని ప్రసంగించాడు. ఇలాగే అతని ప్రసంగం మొత్తం సాగింది. ముఖ్యంగా సాముహిక అత్యాచారాలు, హాస్య నటులపై అణిచివేతలు, కాలుష్యం, ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌లు, కోవిడ్-19 పోరాటు, రైతుల నిరసన.. వీర్‌ దాస్ తన వీడియోలో పేర్కొన్నాడు ఆ వీడియో మొత్తం ఆరు నిమిషాల 53 సెకన్ల నిడివి ఉంది. అందులో ఒక ఇండియాను చూసి మాత్రమే తాను గర్వపడతానని చెప్పుకొచ్చాడు.

అయితే వీర్ దాస్ వీడియోపై పెద్ద ఎత్తు విమర్శలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి పలువురు వీర్ దాస్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీకి చెందిన లాయర్ వివేకానంద్ గుప్తా విదేశీ గడ్డపై ఉండి స్వదేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు. వీర్ దాస్ వాడిన మాటలు ఆమోదయోగ్యం కాదని.. దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీర్ దాస్‌ వాదనలు హాస్యాస్పదంగా ఉన్నాయని.. దేశంలో ప్రతికూల పరిస్థితులను సృష్టించే లక్ష్యంతో ఇలాంటి కామెంట్స్ చేశాడని ఆయన తన ఫిర్యాదులో ప్రస్తావించారు. మరికొందరు కూడా Vir Das వీడియోపై ఇలాంటి ఫిర్యాదులే చేశారు. 

ఇదిలా ఉంటే కొద్దిమంది మాత్రం అతనికి మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Congress MP Shashi Tharoor).. ఆ వీడియోకు సంబంధించి వీర్‌ దాస్‌పై ప్రశ్నంసలు కురిపించారు. అయితే అదే పార్టీకి చెందిన నేత అభిషేక్ మను సింఘ్వీ‌తో (Abhishek Manu Singhvi) సహా మరికొందరు వ్యతిరేకించారు. ప్రపంచం ముందు భారత్‌పై విమర్శలు చేయడాన్ని ఖండిస్తున్నట్టుగా చెప్పారు. కొంత మంది వ్యక్తలు చేసే చెడును.. అందరికి వర్తించేలా మాట్లాడటాన్ని అభిషేక్ మను సింఘ్వీ తప్పుబట్టారు. 

YouTube video player

ఈ క్రమంలోనే ఉన్న వీర్ దాస్ స్పందించారు. తాను పోస్ట్ చేసిన వీడియోలోని వ్యాఖ్యాలు దేశాన్ని అవమానించే ఉద్దేశంతో లేవని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేసిన వీర్ దాస్.. దేశం చాలా గొప్పదని అని పేర్కొన్నారు. రిమైండర్‌గా విభజించడమే తన ఉద్దేశ్యమని చెప్పారు. ‘ఈ వీడియో విభిన్నమైన అంశాలపై రెండు వేర్వేరు భారతదేశాల ద్వంద్వత్వం గురించి సెటైరికల్‌గా ఉంది. ఏ దేశమైనా కాంతి-చీకటి, మంచి-చెడులను కలిగి ఉంటుంది. ఇవేమీ రహస్యం కాదు. మనం గొప్పవారమని మరచిపోకూడదని.. ఈ వీడియో మనకు విజ్ఞప్తి చేస్తుంది. మనల్ని గొప్పగా చేసే వాటిపై దృష్టి పెట్టడం ఎప్పటికీ ఆపకూడదు. మనమందరం ప్రేమించే, విశ్వసించే, గర్వించే దేశానికి చప్పట్లు కొట్టే ఒక భారీ దేశభక్తితో స్పీచ్ ముగుస్తుంది’ అని Vir Das పేర్కొన్నాడు.

Scroll to load tweet…

ప్రజల ద్వేషంతో కాకుండా ఆశతో దేశం కోసం ఉత్సాహంగా ఉన్నారని అన్నారు. అయితే ఎడిట్ చేసిన వీడియోలు తప్పుదారి పట్టవద్దని తన ఫాలోవర్స్‌ను కోరారు. ప్రజలు భారతదేశం కోసం చప్పట్లు కొడతారని పేర్కొన్నారు. తాను దేశం పట్ల గర్వపడుతున్నానని, దానిని ప్రపంచం వ్యాప్తంగా పంచుతాను’ అని చెప్పారు. ‘నాకు.. ప్రపంచంలో ఎక్కడైనా ప్రజలతో నిండిన గది.. భారతదేశానికి ప్రశంసలు ఇవ్వడం అనేది స్వచ్ఛమైన ప్రేమ. నేను మిమ్మల్ని అడుగుతున్నాను.. ఆ ప్రేక్షకులను నేను కోరింది అదే.. వెలుగుపై దృష్టి పెట్టండి. మన గొప్పతనాన్ని గుర్తుంచుకోండి.. దానిని వ్యాప్తి చేయండి’ అని వీర్ దాస్ పేర్కొన్నారు.