దక్షిణాది అగ్ర హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి కాజల్ ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ క్వీన్ రీమేక్ 'ప్యారిస్ ప్యారిస్' సినిమాలో నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం.

ఇందులో కాజల్ అసభ్యకర సన్నివేశంలో నటించడంతో నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. అసలు ఇలాంటి సీన్స్ లో నటించాల్సిన అవసరం ఏమోచ్చిదంటూ ఆమెను ప్రశ్నిస్తున్నారు.'క్వీన్' సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో తమన్నా నటిస్తుండగా తమిళంలో కాజల్ నటిస్తోంది.

చిత్రయూనిట్ విడుదల చేసిన ట్రైలర్ లో ఓ సీన్లో మరోనటి కాజల్ ప్రైవేట్ పార్ట్ ని టచ్ చేస్తుంది. దీంతో సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చ మొదలైంది. తెలుగులో ఇలాంటి సీన్ లేనప్పుడు తమిళంలో ఎందుకు పెట్టారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

అయితే ఈ విషయంపై కాజల్ స్పందించనప్పటికీ దర్శకుడు రమేష్ అరవింద్  మాత్రం ఈ సన్నివేశాన్ని సమర్దిస్తున్నాడు. సినిమా ట్రైలర్ మాత్రమే చూడడంతో అలా అనిపిస్తుందనీ, అంతకుముందు ఆ తరువాత వచ్చే సన్నివేశాలను కలిపి చూస్తే ఆ సన్నివేశం ఎందుకలా ఉందనే కారణం తెలుస్తుందని అన్నారు. ఇలాంటి సన్నివేశం హిందీలో కూడా ఉందని అన్నారు.  
 టీజర్: వామ్మో.. కాజల్ ని అక్కడ టచ్ చేసిందే!