ఇటీవల కాజల్ అగర్వాల్ కు సంబందించిన వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. మొన్న కవచం సినిమా ఈవెంట్ లో కెమెరామెన్ ముద్దుతో హాట్ టాపిక్ గా మరీన కాజల్ నిన్న పెళ్లి టాపిక్ తో అందరూ మాట్లాడుకునేలా చేసింది. ఇక ఇప్పుడు అమ్మడు టీజర్ తో అందరికి మరో షాక్ ఇచ్చింది. 

నేడు క్వీన్ రీమేక్ కు సంబందించిన నాలుగు బాషల టీజర్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తెలుగులో తమన్నా నటించగా తమిళ్ లో పారిస్ పారిస్ అంటూ కాజల్ సందడి చేస్తోంది. అసలు విషయంలోకి వస్తే కాజల్ కి సంబందించిన ఒక సీన్ కుర్రాళ్ళ మతిపోగోట్టేస్తోంది. ఊహించని చోట కాజల్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేయి వేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. 

కన్నడ లో పారుల్ యాదవ్ - మలయాళంలో మంజిమా మోహన్ సాధారణంగానే టీజర్ ను వదిలారు. కానీ కాజల్ పారిస్ పారిస్ లో అడల్ట్ డోస్ ఎక్కువయ్యింది అనే టాక్ వస్తోంది. అందరూ కంటే డిఫరెంట్ గా కాజల్ నటించినట్లు టీజర్ చూస్తేనే అర్ధమవుతోంది. ఇప్పుడే ఈ రేంజ్ లో ఉందంటే ఫుల్ సినిమా వచ్చే సరికి కాజల్ ఇంకా ఏ స్థాయిలో షాకిస్తుందో చూడాలి.