వాడు గిల్లాడు, గిచ్చాడు ఇదేనా షోలో చూపించేది..? బిగ్ బాస్ షో పై నటుడి ఫైర్!

comedian prudhvi fires on bigg boss show
Highlights

ఈ షో వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. అందరినీ ఓ గదిలో పెట్టారు. జనాళ్లను పిచ్చోళ్లను చేయడం తప్ప ఈ షో వల్ల ఏం కలిసొస్తుంది. వాడొచ్చి దీన్ని గిల్లాడు, వీడొచ్చి దాన్ని గిచ్చాడు ఇవేనా షోలో చూపించేవి. 

బిగ్ బాస్ సీజన్ 2 కొంచెం మసాలా అంటూ ముందుగానే ఈ షో ఎలా వుండబోతుందనే విషయంపై ఆడియన్స్ కు క్లారిటీ ఇచ్చారు. దానికి తగ్గట్లే షో కూడా నడుస్తోంది. రాత్రి 9:30 అవుతుందంటే చాలు అందరూ టీవీలకు అతుక్కొని ఈరోజు హౌస్ లో ఏం జరుగుతుందోనని ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ షోపై సంచలన కామెంట్స్ చేశారు నటుడు, కమెడియన్ పృథ్వి.

ఈ షో ద్వారా జనాళ్లను పిచ్చోళ్లను చేస్తున్నారని.. ఒక్కరు కూడా సరైన కంటెస్టెంట్ లేరని ఆరోపిస్తున్నారు. ఈ షోలో తనను, పోసాని కృష్ణమురళి, కేఏ పాల్ వంటి వారు ఉంటే అప్పుడు అసలు మజా వస్తుందని ఆయన కామెంట్ చేస్తున్నారు. 'ఈ షో వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. అందరినీ ఓ గదిలో పెట్టారు. జనాళ్లను పిచ్చోళ్లను చేయడం తప్ప ఈ షో వల్ల ఏం కలిసొస్తుంది.

వాడొచ్చి దీన్ని గిల్లాడు, వీడొచ్చి దాన్ని గిచ్చాడు ఇవేనా షోలో చూపించేవి. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా నాకు హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ వస్తే లోపలి వెళ్లి అందరికీ కడిగి పారేస్తా.. అలాగని బిగ్ బాస్ చెప్పేది నేను వినను. నాకు నచ్చినట్లు నేను ఉంటాను'' అంటూ వెల్లడించారు.    

loader