హాస్యం వదలి రాజయకీయాల్లోకి వస్తాడా!?

Comedian Ali Will Join Politics ?
Highlights

హాస్యం వదలి రాజయకీయాల్లోకి వస్తాడా!?

టాలీవుడ్ హాస్య నటుడు అలీ గురించి మన తెలుగు ప్రేక్షకుకు ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. తనదైన శైలిలో కేవలం హావభావాలతోనే తెలుగు ప్రేక్షకులను అలరించే ఈ సొట్ట బుగ్గల చిన్నోడు రాజకీయాల్లోకి వస్తున్నాడనే పుకార్లు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై అలీ ఇటీవలే స్పందించారు.

అలీ వద్ద పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వరప్రసాద్ పెళ్లికి హాజరైన అలీ, కార్యక్రమం అనంతరం విలేఖరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేఖరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు అలీ సమాధానమిస్తూ.. సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఆ విషయం గురించి చెబుతానని అన్నారు.

అలీ చెప్పిన సమాధానాన్ని బట్టి చూస్తే, ఆయన తప్పకుండా ఏదో ఒక రోజు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. పవణ్ కళ్యాన్‌కి అలీ వీరాభిమాని అన్న సంగతి మనందరికీ తెలిసినదే. ఒకవేళ అలీ నిజంగా రాజకీయాల్లోకి వస్తే తప్పకుండా పవణ్ కళ్యాన్ సరసనే నిలబడే అవకాశం ఉందని సినీప్రియులు గుసగుసలాడుకుంటున్నారు.
 

loader