టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ సినిమా షూటింగ్ కోసం డెహ్రాడూన్ వెళ్లినట్లు తెలుస్తోంది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను డెహ్రాడూన్ లో పూర్తి చేయనున్నారు. కొన్ని కాలేజ్ సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు.

ఈరోజు నుండే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. అయితే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్.. మహేష్ ను కవలడం కోసం సినిమా సెట్స్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన మహేష్ బాబుని ప్రత్యేకంగా కలిసి ముచ్చటించినట్లు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి చిత్రబృందం ఎలాంటి సమాచారం అందివ్వలేదు.

పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపిస్తోన్న ఈ సినిమాలో అల్లరి నరేష్ మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఆయన కూడా ఇప్పటికే డెహ్రాడూన్ కు చేరుకున్నారు. సో.. ఈ షెడ్యూల్ లో మహేష్ తో పాటు నరేష్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.