అఖిల్ కు ఆ డైరెక్టర్ తో పడడం లేదా..?

clashes between akhil and venky atluri
Highlights

అక్కినేని అఖిల్ నటించిన మొదటి సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. అది కాస్త డిజాస్టర్ కావడంతో కాస్త బ్రేక్ తీసుకొని 'హలో' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు

అక్కినేని అఖిల్ నటించిన మొదటి సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. అది కాస్త డిజాస్టర్ కావడంతో కాస్త బ్రేక్ తీసుకొని 'హలో' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. కానీ ఓ మోస్తరుగా ఆడడంతో అఖిల్ కాస్త రిలాక్స్ అయ్యాడు. కానీ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాల్సిన పరిస్థితి. అటువంటి సినిమాపై ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటిది సినిమా సెట్స్ పైకి వెళ్లిన తరువాత దర్శకుడితో అఖిల్ కు క్లాషెస్ వస్తున్నాయని టాక్.

అఖిల్ రెండు రోజులు షూటింగ్ కు హాజరు కాకపోవడంతో సినిమా ఒక దశలో ఆగిపోతుందనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అసలు విషయంలోకి వస్తే.. 'తొలిప్రేమ' సినిమాతో సక్సెస్ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి తన రెండో సినిమా అఖిల్ తో చేస్తున్నాడు. అతడు మొదట అఖిల్ కు చెప్పిన కథనే సినిమాగా చేస్తున్నాడు. అయితే కథా పరంగా అఖిల్ సెట్స్ పైకి వెళ్లిన తరువాత మార్పులు సూచించడం వంటి విషయాలు వెంకీకు నచ్చడం లేదట. కానీ ఏం చేయలేక అఖిల్ చెప్పిన వెర్షన్, వెంకీ వెర్షన్ ఇలా ఒక్కో సీన్ రెండు, మూడు వెర్షన్లుగా చేసుకుంటూ వెళ్తున్నారట.

ఎడిటింగ్ టేబుల్ వద్ద ఫైనల్ గా ఏ వెర్షన్ ఉంటుందనే విషయంలో స్పష్టత లేదు. ఈ మధ్య రెండు రోజులు అఖిల్ షూటింగ్ కు వెళ్లలేదని సమాచారం. వెంకీ కథలో చేస్తోన్న మార్పులు అఖిల్ కు నచ్చకే ఈ విధంగా చేస్తున్నాడని యూనిట్ లో ఉన్న కొందరు వ్యక్తుల కారణంగా విషయం బయటకు పొక్కింది. సెట్ లో ఇంత జరుగుతున్నా నిర్మాత మాత్రం ఏం అనకుండా గమ్మున ఉండిపోతున్నాడని టాక్. మరి ఈ విషయం ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి!

loader