అనుపమ పరమేశ్వరన్ తో ప్రకాష్ రాజ్ కు ఇబ్బందేంటి..?

clash between prakash raj and anupama parameshwaran
Highlights

టి అనుపమ పరమేశ్వరన్ మాత్రం ప్రకాష్ రాజ్ ప్రవర్తన పట్ల అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆయన చేసిన వ్యాఖ్యలకు బాధ పడి కంటతడి కూడా పెట్టుకుందని చెబుతున్నారు. 

సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ కు కాస్త కోపం ఎక్కువనే సంగతి తెలిసిందే. మీడియా సభ్యులతో కూడా గతంలో ఆయన గొడవ పడిన సందర్భాలు ఉన్నాయి. అయితే సీనియర్ యాక్టర్ కావడంతో ఆయన రెండు మాటలు అన్నా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ నటి అనుపమ పరమేశ్వరన్ మాత్రం ప్రకాష్ రాజ్ ప్రవర్తన పట్ల అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆయన చేసిన వ్యాఖ్యలకు బాధ పడి కంటతడి కూడా పెట్టుకుందని చెబుతున్నారు.

అసలు విషయంలోకి వస్తే.. ప్రస్తుతం అనుపమ.. త్రినధరావు నక్కిన దర్శకత్వంలో 'హలో గురు ప్రేమకోసమే' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో అనుపమకు తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. అయితే షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య చిన్న గొడవ జరిగిందని టాక్. సినిమాలో ఓ కీలక సన్నివేశం షూట్ చేసే సమయంలో ప్రకాష్ రాజ్ స్క్రిప్ట్ తీసుకొని అనుపమతో సీన్ గురించి చర్చించాలని అన్నారట.

ఆ తరువాత దీన్ని ఇలా ఇంప్రూవైజ్ చేస్తే బాగుంటుందని చెబుతూ టాపిక్ మాట్లాడుతుంటే.. సడెన్ గా అనుపమ ఫీల్ అయినట్లు సమాచారం. ఇద్దరికీ మధ్య ఎక్కడ చెడిందో కానీ వెంటనే అనుపమ నాకు నటించడం రాదనుకుంటున్నారా..? మీరెందుకు నాకు చెబుతున్నారు..? అంటూ ఆయన్ని ఏదో అనేసి కన్నీళ్లు కూడా పెట్టుకుందట. డైలాగ్స్ చెప్పడంలో ఆమె తడబడిన కారణంగా ప్రకాష్ ఆమెకు ఏదో చెప్పబోతే అది కాస్త ఇలా సీరియస్ ఇష్యూ అవ్వడంతో ఆయన కూడా షూటింగ్ నుండి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. 

loader