తన ప్రేమ వ్యవహారంతో కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోన్న నటి ప్రియాంక చోప్రా.. సల్మాన్ ఖాన్ సరసన 'భరత్' అనే సినిమాలో నటించడానికి అంగీకరించింది. కానీ ఆ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు అనౌన్స్ చేసింది. దీంతో నిక్ జోనస్ తోనే తన పెళ్లి కోసమే ప్రియాంక సినిమా నుండి తప్పుకుందనే వార్తలు వినిపించాయి. కానీ హాలీవుడ్ లో 'కౌబాయ్ నింజా వికింగ్' అనే సినిమాలో నటించడానికి ఆమె 'భరత్' సినిమాను వదులుకుంది.

క్రిస్ పాట్ వంటి స్టార్ హీరోతో నటించే అవకాశం కావడంతో సల్మాన్ సినిమాను వదులుకుంది ప్రియాంక. కానీ ఇప్పుడు ఆ సినిమాను వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించి ప్రియాంకకు షాక్ ఇచ్చారు. ప్రొడక్షన్ షెడ్యూలింగ్ లో కొన్ని ఇబ్బందుల కారణంగా ఇప్పట్లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లే ఛాన్స్ లేదు. 2019లో కూడా ఈ సినిమా విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు.

ఈ హాలీవుడ్ సినిమా కోసం బాలీవుడ్ సినిమా వదులుకున్న ప్రియాంక ఇప్పుడు ఫీల్ అవుతుందట. ఈ సినిమాలో కచ్చితంగా హీరోయిన్ అయితే ఆమెనే కానీ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం ప్రియాంక 'ది స్కై ఈజ్ పింక్' అనే సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు.