సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం 'కాలా'. జూన్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలను విడుదల చేస్తోంది చిత్రబృందం.

తాజాగా 'చిట్టమ్మా' అంటూ సాగే ఓ పాట ప్రోమోను విడుదల చేశారు. ఇందులో చిట్టమ్మ అంటే నటి హుమా ఖురేషి. రజినీకాంత్ ఆమెను ఉద్దేశిస్తూ.. 'తనకు నేనే లోకం నేను మాత్రమే.. తను నా దేవత రా.. నా కుల దైవం' అంటూ చెప్పిన డైలాగ్ ఆకర్షిస్తోంది.

సినిమాలో రజినీకాంత్ భార్య పాత్రలో ఈశ్వరిరావు కనిపించనుంది. హుమా ఖురేషి పాత్ర సినిమాలో రజినీకాంత్ ను ప్రేమించే పాత్రలో కనిపించనుందని టాక్. పా.రంజిత్ ఈ సినిమాకు దర్శకత్వబాధ్యతలు నిర్వహించగా ధనుష్ ఈ సినిమాను నిర్మించారు.