Ennenno Janmala Bandham: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మంచి ఫ్యామిలీ కం లవ్ స్టోరీ నేపథ్యంలో వస్తుంది. మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకుంది. ఇక ఈరోజు మార్చి 7వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. 

ఎపిసోడ్ ప్రారంభంలో చిత్ర గదిలోకి వచ్చిన వేదతో అక్క నీకు ఒక గుడ్ న్యూస్ నాకు ముంబైలో జాబ్ వచ్చింది. అప్పుడెప్పుడో పెట్టుకున్న అప్లికేషన్ ఇప్పుడు యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడే ఫోన్ చేసి జాబ్ కన్ఫర్మ్ చేశారు. నేను రేపే ముంబై వెళ్ళిపోతాను. నాకు ఒక వసంత్ వద్దు, ఎవరూ వద్దు ఒంటరిగా బ్రతకలేనా అంటూ బాగా ఎమోషనల్ అవుతుంది చిత్ర.

వేదని హగ్ చేసుకుని వసంత్ ను ప్రేమించడం తప్పా, పెళ్లి చేసుకోవడం తప్పా, అప్పుడేమో ఎవరో నిధి వచ్చి నన్ను వసంత్ నుంచి దూరం చేయాలనుకుంది. ఇప్పుడేమో ఈ మాళవిక వచ్చి మా పెళ్లి చెడగొట్టేసింది. ఎందుకక్కా మా పెళ్ళికి ఎన్ని అడ్డంకులు అంటూ తల పట్టుకుని ఏడుస్తుంది. మీ అక్క ఉండగా నీ నుంచి ఎవరు లాక్కోలేరు అంటుంది వేద.

ఎవరో ఎందుకు అక్క వసంతే నాకు అన్యాయం చేస్తున్నాడు. అయినా ఆ మాళవిక ఎవరు మా పెళ్లి చెడ కొట్టడానికి, వసంత్ అడగాలి కదా ఎందుకు నిలదీయలేదు.. ఎదురు తిరగాలి కదా అతనికి నేనంటే ఇష్టం లేదేమో అంటూ ఏడుస్తుంది. నీకు జరిగింది అన్యాయమే.. అందుకు కారణం వసంత్ మాత్రమే కాదు వసంత్ వెనుక ఇంకొకరు ఉన్నారు అంటుంది వేద.

ఆయన వేరెవరో కాదు మీ బావగారు.. ఆయన కూడా అసలు నోరు తప్పకుండా నిల్చున్నారు. ఆయన్ని అడిగితేనే అసలు నిజం బయటికి వస్తుంది అంటుంది వేద. మరోవైపు మాళవిక అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటాడు యష్. అక్కడికి వచ్చిన వేద అసలు ఏం జరుగుతుంది.

ఆ మాళవిక అక్కడికి రావటం ఏంటి, తను అబ్జెక్షన్ చెప్తే పెళ్లి ఆగిపోవడం ఏంటి మీ కళ్ళముందే ఇదంతా జరుగుతుంటే మీరు మాట్లాడకపోవడం ఏంటి అంటూ టకటక ప్రశ్నలు వేస్తుంది వేద. నన్ను ఏ ప్రశ్నలు వేయొద్దు మీ ఏ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు అంటాడు యష్. మీరు నిజాన్ని చెప్పలేకపోతున్నారు నా దగ్గర ఏదో దాస్తున్నారు అంటుంది వేద. నేను సమాధానం చెప్పలేని ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టొద్దని చెప్తుంటే వినిపించుకోవేం అంటాడు యష్.

ఆఖరి నిమిషంలో పెళ్లి ఆగిపోయి ఏడుస్తుంది నా చెల్లెలు తనకి ఏం సమాధానం చెప్పమంటారు, ఎలా సముదాయించమంటారు.. ఇది భవిష్యత్తుకి సంబంధించిన సమస్య మన కుటుంబ గౌరవానికి సంబంధించిన సమస్య నాకు సమాధానం చెప్పి తీరాలి, అసలు ఎవరు ఆ మాళవిక తనకి ఎంత ధైర్యం నా చెల్లెలు పెళ్లి చెడగొట్టడానికి, అసలు సమస్య అంతా మీతోనే ప్రతిదీ దాపరికమే.

పెళ్లికి ముందు మీకు ఆదిత్య అనే ఒక కొడుకు ఉన్నట్లుగా దాచారు, ఆ తర్వాత అమ్మకు యాక్సిడెంట్ చేసింది ఆదిత్య అని దాచిపెట్టారు. ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది మన పెళ్లి కూడా నిజమా అబద్దమా అన్నది అంటూ బాగా ఎమోషనల్ అవుతుంది. నువ్వు నన్ను ఎన్ని రకాలుగా నిలదీసిన ప్రయోజనం లేదు, నా నుంచి నిజాన్ని రాబట్ట లేవు అంటాడు యష్.

నామీద మీకు నమ్మకం లేనట్టే, ప్రతిదానికి మీ దగ్గర ఒక సమాధానం ఉంటుంది కానీ ఈ విషయంలో మాత్రం ఎందుకు మీ మౌనం వెనుక ఉన్న అసలు కారణమేంటి అని గట్టిగా అడుగుతుంది వేద. నేనే అంటూ వెనకనుంచి వస్తాడు వసంత్. ఒక్కసారిగా షాక్ అయి వెనక్కి తిరిగిన వేద నువ్వా అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది.

అన్నయ్య మౌనానికి కారణం నామీద ఒట్టేయించుకొని నేను తీసుకున్న మాట. మాళవిక ఏ హక్కుతో అంత రాద్దాంతం చేయగలిగింది అని అడిగావు, దానికి కారణం మాళవిక నేను చెప్పుకోవడానికి సిగ్గుపడే నా అక్క అంటూ అసలు నిజాన్ని బయటపడతాడు. ఒక్కసారిగా షాక్ అవుతుంది వేద. తను ఎప్పుడైతే ఒక నీచమైన పని చేసిందో, డబ్బు కోసం భర్తని బిడ్డని వదిలేసి పరాయి వాడి పంచన చేరిందో ఆ క్షణమే తమ్ముడిగా తెగతెంపులు చేసుకున్నాను.

నా లైఫ్ లో నుంచి సిస్టర్ అనే పదాన్ని డిలీట్ చేసేసాను. మా బ్లడ్ రిలేషన్ గురించి ఎవరితోనో చెప్పొద్దని యశోదర్ తో ప్రమాణం చేయించుకున్నాను అంటాడు వసంత్. వసంత్ ని చూస్తే గర్వంగా ఉంది మా ఇద్దరి స్నేహం కంటే రక్తసంబంధం గొప్పది కాదు అని సొంత అక్కని దూరం చేసుకున్నాడు. మాళవిక నా జీవితంలో నుంచి వెళ్ళిపోయింది ఖుషి పసిబిడ్డగా నా చేతిలో ఉండిపోయింది.

చాలీచాలని జీతంతో ఒక మిడిల్ క్లాస్ జీవితం, భార్యా వదిలేసిన భర్తగా గుండె పగిలిపోయే అంతగా ఏడ్చాను. నా పరిస్థితి శత్రువుకి కూడా రాకూడదు అనుకున్నాను. ఒక దశలో సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నాను. కానీ కసిగా జీవితాన్ని మళ్లీ కొత్తగా మొదలుపెట్టాలి అనుకున్నాను. అప్పుడు నా పక్కన నిలబడింది వసంత్ మాత్రమే తను లేకపోతే నేను ఏమైపోయేవాడినో.

తను లేకపోతే నేను లేను అంటూ వసంత్ ని ఎమోషనల్ గా హగ్ చేసుకుంటాడు యష్. ఏంటిది చిన్నపిల్లాడి లాగా యువర్ ఆల్వేస్ విన్నర్ అంటూ అతన్ని ఊరడిస్తాడు వసంత్. ఇదేరా ఫ్రెండ్షిప్ అంటే అంటాడు వసంత్. వేద దగ్గరికి వచ్చిన వసంత్ మాళవిక రిజిస్టర్ ఆఫీసర్ దగ్గర చాలా ఎక్కువ చేసింది, యశోదర్ నాకు ఇచ్చిన మాటకి కట్టుబడి నోరు విప్పలేదు.

మాళవిక అంటే నాకు ఇష్టం లేదు.. అందుకే తనని కన్నెత్తి చూడటానికి కూడా ఇష్టపడలేదు అంటాడు వసంత్. యు ఆర్ గ్రేట్ వసంత్ రక్తసంబంధం కంటే స్నేహబంధం గొప్పది అని నిరూపించినందుకు కానీ అదే సమయంలో నిన్ను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని తనకి జ్ఞానం చేయవలసిన బాధ్యత కూడా నీ మీదే ఉంది అంటుంది వేద.

నీలాగే చిత్ర కూడా నన్ను అర్థం చేసుకుంటుంది అనుకుంటున్నాను అంటాడు యష్. తప్పకుండా అర్థం చేసుకుంటుంది ఒకసారి వచ్చి కలువు అంటుంది వేద. నాకు మీ ఇద్దరి బ్లెస్సింగ్స్ ఉంటే అంతే చాలు అంటాడు వసంత్. మరోవైపు హాల్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అటెండ్ అవుతారు. ఇన్నాళ్లు మనకి తెలిసిన వసంత్ వేరు, ఇప్పుడు వసంత్ వేరు నాకు వసంత్ అంటే గౌరవం పెరిగింది అంటూ చిత్రతో చెప్తుంది వేద.

మోసం చేసిన అక్కతో కాకుండా మోసపోయిన బావకి సపోర్ట్ గా ఉన్నాడు అదే వాడి గొప్పతనం అంటాడు రత్నం. అంతలోనే అక్కడికి వచ్చిన వసంత్ మాళవిక నా అక్క అని చెప్పుకోవటం నాకు ఇష్టం లేదు అందుకే నీ దగ్గర దాచి పెట్టాను. నిన్ను మోసం చేశాను అని అనుకుంటే నన్ను క్షమించు అంటాడు వసంత్. జరిగిందంతా అక్క నాతో చెప్పింది, న్యాయం కోసం రక్తసంబంధాన్ని కూడా వదులుకున్న నువ్వంటే గౌరవం ఇంకా పెరిగింది అంటూ అతన్ని హాగ్ చేసుకుంటుంది చిత్ర.

మీ దగ్గర నిజం దాయడం తప్పే కానీ ఎవరిని మోసం చేయలేదు, నాకు ఉన్న కుటుంబ సభ్యులు మీరే నాకు వేరే ఎవరితోని సంబంధం లేదు చిత్రని నేను గాఢంగా ప్రేమిస్తున్నాను తనని అంతకన్నా బాగా చూసుకుంటాను అంటూ సులోచనకి చెప్తాడు వసంత్. తరువాయి భాగంలో ఆనందంగా హోలీ జరుపుకుంటూ ఉంటారు వేద దంపతులు. అంతలోనే అక్కడికి తుపాకీతో వస్తుంది మాళవిక.