చిరు సరసన సాంగ్ చేస్తున్న లక్ష్మిరాయ్ చిరు 150వ సినిమాలో లక్ష్మిరాయ్ స్టెప్పులు చిరుతో స్టెప్పులేసేందుకు లక్ష్మిరాయ్ కి ఛాన్స్
మెగాస్టార్ 150వ చిత్రం ఖైదీ నంబర్ 150. వీవీ వినాయక్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రామ్‌చరణ్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్‌లో చిరంజీవి పక్కన కేథరిన్ స్టెప్పులేస్తుందని అందరం అననకున్నాం.. అయితే.. ఏదో కారణం వల్ల ఆమెను తప్పించి రాయ్ లక్ష్మిని తీసుకొచ్చేశారు. చిరంజీవి పెద్ద కూతురు సుష్మితనే కేథరిన్‌ను తప్పించి రాయ్ లక్ష్మికి అవకాశం ఇచ్చిందని తెలుస్తోంది.
అంది వచ్చిన అవకాశాన్ని పట్టేసుకున్న లక్ష్మి రాయ్.. ఆలస్యం చేయకుండా షూటింగ్‌లో చేరిపోయింది. చిరు పక్కన స్టెప్పలేస్తూ ఎంజాయ్ చేస్తోంది. సెట్లో చిరుతో కలిసి దిగిన ఫొటోను సోషల్ సైట్లో షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్‌లో చిరంజీవి మునుపటి మ్యానరిజంతో ఉన్నాడు. ఇక, సుష్మిత డిజైన్ చేసిన ఐటెం డ్రెస్‌లో మెరిసిపోతోంది రాయ్ లక్ష్మి. చిరు ఎంతో ఉన్నతమైన వారని పొగడ్తలతో ముంంచెత్తుతోంది రాయ్ లక్ష్మి. మరి సాంగ్ ఏ రేంజ్-లో అలరిస్తుందో చూడాలి.
