మెగాస్టార్‌ చిరంజీవి `అంజి` సినిమాలో నటించారు. దీనికి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ మూవీ వైరల్‌ అవుతుంది. దర్శకుడు కోడి రామకృష్ణ చెప్పిన విషయం చక్కర్లు  కొడుతుంది.

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన `అంజి` సినిమా సోషియో ఫాంటసీలో ఓ ట్రెండ్‌ సెట్టర్‌. శివుడి ఆత్మలింగం అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీకి ప్రముఖ దర్శకుడు కోడిరామకృష్ణ దర్శకత్వం వహించారు. ఇందులో చిరు సరసన నమ్రత హీరోయిన్‌గా నటించడం విశేషం. ఈ మూవీ ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఓ వైపు `హనుమాన్‌` మూవీ బాగా ఆదరణ పొందుతుంది. ఇది చిరంజీవి `అంజి`కి కాపీ అని, చాలా సీన్లు లేపేశారనే వార్తలు వైరల్‌ అవుతున్నాయి. 

ఈ నేపథ్యంలో దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ ఇంటర్వ్యూకి సంబంధించిన ఓ వీడియో వైరల్‌ అవుతుంది. ఇందులో చిరంజీవి గురించి కోడి రామకృష్ణ చెప్పిన విషయం చక్కర్లు కొడుతుంది. మెగాస్టార్‌ గురించి ఆయన చాలా గొప్పగా చెప్పారు. అదే సమయంలో ఓ షాకింగ్‌ విషయాన్ని వెల్లడించారు. `అంజి` సినిమా గురించి చెప్పుకొచ్చారు కోడి రామకృష్ణ. ఇందులో సినిమా పెద్దగా ఆదరణ పొందలేదని ఒప్పుకున్న ఆయన అప్పటి వరకు ఇలాంటి కాన్సెప్ట్ తో మూవీ రాలేదు, మున్ముందు ఇదొక గొప్ప మూవీగా నిలుస్తుందని చెప్పారు. 

అంచనాలతో చూస్తే సినిమా డిజప్పాయింట్‌ చేయోచ్చేమో కానీ, చూడగా చూడగా ఒక `బెన్‌హర్‌`లాగా నిలిచిపోతుందన్నారు. ఈ మూవీ ఫస్ట్ క్రెడిట్‌ నిర్మాత శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డికి దక్కుతుందని చెప్పారు. ఈ సినిమా విషయంలో చిరంజీవి ఎంతో ఆసక్తి చూపించారని, ఆయన బాగా చేద్దామని ఎంతో ఎంకరేజ్‌ చేసేవారని తెలిపారు. ఎంతో డెడికేషన్‌తో పనిచేశారని తెలిపారు. 

Scroll to load tweet…

ఆ డెడికేషన్‌ గురించి చెబుతూ, `అంజి` సినిమాలో చిరంజీవి క్లైమాక్స్ లో వేసిన డ్రెస్‌ రెండేళ్లు వేసినట్టు చెప్పారు. అయితే క్లైమాక్స్ షూట్‌కి రెండేళ్లు పట్టిందని, ఆ డ్రెస్‌ మారిస్తే ఆ మరకలు ఉండవు, సహజత్వం కోల్పోతుంది, ఆ మార్పు కనిపిస్తుంది. అందుకే ఉతకని డ్రెస్‌ని ఆయన రెండేళ్లు వేసినట్టు చెప్పారు. ఆల్టర్‌ నేట్‌ లేకపోవడంతో కచ్చితంగా వేయాల్సి వచ్చిందని, కానీ ఏ రోజూ ఇబ్బంది పడలేదని వెల్లడించారు. ప్రస్తుతం చిరంజీవి `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. వశిష్ట దీనికి దర్శకత్వం వహ

Read more: చిరంజీవి `అంజి` సినిమాకి `హనుమాన్` మూవీ కాపీనా?.. ప్రశాంత్ వర్మ ఇలా దొరికాడేంటి?.. ఏకంగా మక్కీకి మక్కి లేపారే?