చిరంజీవి `అంజి` సినిమాకి `హనుమాన్` మూవీ కాపీనా?.. ప్రశాంత్ వర్మ ఇలా దొరికాడేంటి?.. ఏకంగా మక్కీకి మక్కి లేపారే?
ప్రశాంత్ వర్మ రూపొందించిన `హనుమాన్` మూవీ.. మెగాస్టార్ చిరంజీవి నటించిన `అంజి` సినిమాకి కాపీనా? అందులో ఆత్మలింగం, ఇందులో `మణి`..సీన్లన్నీ సేమ్ టూ సేమ్..
ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన `హనుమాన్` మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై పాజిటివ్ టాక్‌తో రన్ అవుతుంది. భారీ కలెక్షన్లని సాధిస్తుంది. ఇప్పటికే ఇది బ్రేక్ ఈవెన్ దాటింది. సంక్రాంతి పోటీలో చాలా సినిమాలున్నప్పటికీ దీనికి మంచి కలెక్షన్లు వస్తుండటం విశేషం. మున్ముందు ఇది పెద్ద విజయం సాధించే దిశగా వెళ్తుంది.
సినిమాలో ప్రధానంగా హనుమంతుడి ఎలిమెంట్లు హైలైట్‌గా నిలుస్తున్నాయి. మిగిలిన అంశాలు రెగ్యూలర్‌గానే ఉన్నా హనుమంతుడి రక్తపు బొట్టు ద్వారా ఏర్పడి మణిలో ఉన్న శక్తి, ఆశక్తి హీరో తేజ సజ్జాకి రావడం, ఆయన విలన్లని ఎదుర్కోవడం హైలైట్‌గా నిలిచింది. క్లైమాక్స్ లో హనుమంతుడిని చూపించే సీన్లు, తేజ, హనుమంతుడు ఎదురుపడే సీన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఆకట్టుకుంటున్నాయి.
ప్రధానంగా ఈ మూవీ ఆ మణి చుట్టునే సాగుతుంది. విలన్ వినయ్ రాయ్.. తనకు సూపర్ హీరో పవర్స్ సాధించి, ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటాడు. దీనికోసం అనేక ప్రయోగాలు చేస్తాడు. కానీ ఆ పవర్స్ రావు. కానీ అంజనాద్రి అనే ఫారెస్ట్ లో ఉండే గ్రామంలో హీరో హనుమంతుది అంతటి శక్తితో అక్కడి వారిని కాపాడారనే విషయం తెలుసుకుని అక్కడికి వస్తాడు. ఆ మణి శక్తి గురించి తెలుసుకుని దాన్ని సొంతం చేసుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో హీరోకి, అతనికి మధ్య పోరాటం జరుగుతుంది. ఆ శక్తిని సాధించి ప్రపంచంలో తానే తిరుగులేని శక్తిగా ఎదగాలనేది విలన్ ఆలోచన. దాన్ని హీరో, హనుమాన్ శక్తి అడ్డుకుని అంతం చేస్తుంది.
అయితే `హనుమాన్` మూవీ విషయంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ కాపీ కొట్టాడని తెలుస్తుంది. ఆయన సినిమాలోని కోర్ పాయింట్‌ని లేపాడని తెలుస్తుంది. అంతేకాదు చాలా సీన్లు చిరంజీవి సినిమా నుంచి లేపేశాడని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన `అంజి` సినిమాలో కూడా సరిగ్గా ఇలాంటి కథాంశంతోనే వచ్చింది. అందులో హీరో ఫారెస్ట్ లోనే ఉంటాడు. అతన్ని విలన్లు కొట్టి లోయలో పడేస్తారు. ఆ లోయలో చిరుకి శివుడి ఆత్మలింగం దొరుకుతుంది. ప్రణవశివరాత్రి రోజు అది ప్రకాశిస్తుంది. దాని పట్టుకుంటే ఆ శక్తి మనుషులకు వస్తుంది.
ఆ లోయలో తనకు ఆ ఆత్మలింగం దొరకడంతో దాన్ని పట్టుకోగానే ఆయనకు తగిలిన దెబ్బలన్నీ మాయమైపోతాయి. అంతేకాదు దాన్ని తీసుకుని తన ఆశ్రమంకి రాగా విలన్లు ఆశ్రమంలో పిల్లలు కొట్టి వెళ్లిపోతారు. దెబ్బలతో ఉన్న ఆ పిల్లలు ఆ ఆత్మలింగాన్ని పట్టుకోగానే దెబ్బలన్నీ నయం అవుతాయి.
విలన్ ఆ ఆత్మలింగం సాధించాలని వస్తాడు. మొదట చిరంజీవి అడగ్గా ఇవ్వము పోమ్మంటారు. ఆ తర్వాత తన సైన్యంతో వచ్చి చిరంజీవిపై దాడి చేస్తాడు. అంతిమ పోరాటం జరుగుతుంది. విలన్‌ని అంతం చేస్తాడు చిరు.
ఇక `హనుమాన్` సినిమాలో సరిగ్గా అదే సీన్లు ఉంటాయి. హీరోయిన్ కాపాడే క్రమంలో హీరో తేజని బంధిపోట్లు కొట్టి లోయలో పడేస్తారు. అలా తేజ.. నదిలో పడిపోతాడు. ఆ నది లోపల అతనికి హనుమంతుడి రక్తంతో ఏర్పడిన మణి దొరుకుతుంది. ఇంట్లోకి వచ్చి ఆ మణిని సూర్యరశ్మీకి చూడటంతో ఆ శక్తి తేజకి వస్తుంది. దీంతో హనుమంతుడి శక్తి అతనికి వస్తుంది. ప్రత్యర్థులను చితకబాదుతాడు. అలా చివరికి ఆ మణికి వినయ్ రాయ్ వచ్చి లాక్కునే ప్రయత్నం జరుగుతుంది. అప్పుడు ఆ శక్తి తేజని కాపాడుతుంది. ఈపోరాటంలో విలన్‌ని తేజ చంపేస్తాడు.
ఇలా రెండు సినిమాలో మెయిన్ పాయింట్ సేమ్. `హనుమాన్`లో హనుమంతుడి మణి శక్తి అయితే, `అంజి`లో శివుడి ఆత్మలింగం శక్తి. వాటి రూపం కూడా ఒకేలా ఉంది. సీన్లతో సహా `హనుమాన్` మూవీలో కాపీ కాపీ కొట్టడం గమనార్హం. ప్రశాంత్ వర్మ క్రియేటివ్‌గా మంచి పేరుంది. కానీ సీన్లు, మెయిన్ కోర్ పాయింట్‌ని కాపీ కొట్టడం ఇప్పుడు ఆశ్చర్యపరుస్తుంది. మరి దీనిపై వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
చిరంజీవి నటించిన `అంజి` మూవీకి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. నమ్రత ఇందులో హీరోయిన్‌గా నటించింది. 2004లో ఈ మూవీ విడుదలైంది. సోషియో ఫాంటసీగా తెరకెక్కించారు. ఇందులో విలన పాత్రలో `సలార్` ఫేమ్ తిను ఆనంద్ నటించారు. ఈ మూవీ నంది అవార్డులను. అలాగే స్పెషల్ ఎఫెక్ట్స్ లో జాతీయ అవార్డుని సొంతం చేసుకుంది. కానీ కమర్షియల్ గా సత్తాచాటలేకపోయింది.