రాయ్ లక్ష్మీ లేటెస్ట్ మూవీ 'జూలీ-2' శుక్రవారం ( నవంబర్ 24) ప్రేక్షకుల ముందుకు రానుంది. 14 ఏళ్ల క్రితం విడుదలై సంచలనం రేపిన 'జూలీ' సినిమాకు సీక్వెల్ గా ఈ జూలీ పార్ట్ టూ వస్తోంది. అప్పట్లో నేహాదూపియా ఆ సినిమాతో సంచలనం రేపింది. ఇప్పుడు 'జూలీ-2'లో లక్ష్మీ రాయ్ టైటిల్ పాత్రను పోషిస్తోంది. శుక్రవారం విడుదలకానున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను వినూత్న పద్ధతుల్లో నిర్వహిస్తున్నారు.

 

తాజాగా లక్ష్మీరాయ్‌కి, ‘జూలీ-2'‌ చిత్ర యూనిట్‌కు మెగాస్టార్ చిరంజీవి వీడియోలో బెస్ట్ విషెస్ తెలిపాడు. ఏకంగా ఒక వీడియో సందేశమే పంపాడు చిరు... దీంతో రాయ్ లక్ష్మి ఆనందం మాటల్లో చెప్పలేనిదిగా మారింది. వీడియోలో సందేశంలో చిరంజీవి రాయ్ లక్ష్మికీ, జూలీ 2 టీమ్‌కీ శుభాకాంక్షలు చెప్పాడు. ‘హాయ్ రాయ్ లక్ష్మీ. బాలీవుడ్‌లో నీ మొదటి సినిమా విడుదలకానున్న సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సినిమా నీకు చాలా ప్రత్యేకమైనదని తెలుసు. నీ సినిమా కెరియర్‌లో ఇది 50వ చిత్రం. గుడ్ లక్ టు జూలీ 2 నీలో ఉన్న టాలెంట్‌ని, నీలో దాగి ఉన్న శక్తిని ఈ సినిమా బయటపెడుతుందని నేను నమ్ముతున్నాను. ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అందుకోవాలని కోరుకుంటున్నాను. జూలీ 2 విడుదల సందర్భంగా మరొక్కసారి నీకు శుభాకాంక్షలు. గుడ్ లక్ టు జూలీ 2. లవ్ యు టు..'' అన్నారు.

 

చిరు నుండి ఈ శుభాకాంక్షలు అందుకున్న రాయ్ లక్ష్మీ ఆనందాశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ ట్వీట్ చేసింది. "ఓ మై గాడ్, నిజంగా మీ దీవెనలు నా హృదయాన్ని హత్తుకున్నాయి. ఇది నా జీవితంలోనే గొప్ప బహుమతిగా భావిస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు చిరంజీవి గారూ.., మీ దీవెనలను గౌరవంగా స్వీకరిస్తున్నా. మీరిచ్చిన ఈ ఉత్సాహంతో మీ రత్తాలు సర్‌ప్రైజ్ అయింది. లవ్ యు..సార్"అంటూ తెగ మురిసిపోతూ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.