ఖైదీ నెం.150 చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దాని తర్వాత చిరు నటిస్తున్న తాజా చిత్రం సైరా నర్సింహారెడ్డి. రాయలసీమకు చెందిన స్వాత్రంత్య సమరయోధుడు ఉయ్యాల వాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

 

ఈ సినిమాని తమ సొంత బ్యానర్ లోనే నిర్మిస్తున్నారు.  కొణిదెల ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాకి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చరణ్ ఒకవైపు తన సినిమా షూటింగ్ లలో పల్గొంటూనే ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను దగ్గరుండి  పర్యవేక్షిస్తున్నారట.

 

ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమాలో చిరంజీవి వాడబోతున్న చెప్పులు - క్యాస్ట్యూమ్స్ కోసం భారీగా బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. బాలీవుడ్ నుంచి ఇద్దురు డిజైనర్లుని రప్పించి ఈ సినిమాలో ఉండే సన్నివేశాలకు తగ్గట్లుగా కాస్ట్యూమ్స్ వాటికి సరిపడా చెప్పులు రెడీ చెయిస్తున్నారట. ఇలా డిజైన్ చేయించినందుకు ఆ బాలీవుడ్ డిజైనర్లు దాదాపు అయిదుకోట్ల రూపాయులు ఛార్జ్ చేస్తున్నట్లు తెలిసింది. దీంతో కేవలం చెప్పులు - బట్టలు కోసమే ఇంత భారీగా ఖర్చు చేస్తున్నారంటే సినిమా ఓ రేంజ్ లో ఉండి ఉంటుందని ఫిల్మ్ నగర్ లో ఊహాగానాలు మొదలయ్యాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బిగ్ బి అమితాబచ్చన్ కీలక పాత్ర పోషిస్తోండగా.. నయనతార, ప్రగ్యా జైశ్వాల్  హీరోయిన్లుగా నటిస్తున్నారు.