MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • OTT Movies: దద్దరిల్లే క్లైమాక్స్ ట్విస్ట్ ల కోసం ఈ 5 సినిమాలు ఓటీటీలో చూడాల్సిందే..గూస్ బంప్స్ గ్యారెంటీ

OTT Movies: దద్దరిల్లే క్లైమాక్స్ ట్విస్ట్ ల కోసం ఈ 5 సినిమాలు ఓటీటీలో చూడాల్సిందే..గూస్ బంప్స్ గ్యారెంటీ

క్లైమాక్స్ లో సరైన ట్విస్ట్ పడితే ఆ సినిమా రేంజ్ మారిపోతుంది. జనాల్లో సూపర్ హిట్ టాక్ వచ్చేస్తుంది. క్లైమాక్స్ లో దిమ్మ తిరిగే ట్విస్ట్ లతో గూస్ బంప్స్ తెప్పించిన సినిమాలు కొన్ని ఉన్నాయి. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 11 2026, 04:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Ram Charan
Image Credit : Asianet News

Ram Charan

టాలీవుడ్ లో క్లైమాక్స్ ట్విస్ట్ లతోనే అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించిన సినిమాలు కొన్ని ఉన్నాయి. క్లైమాక్స్ వల్లే ఆ సినిమాల గురించి పెద్దఎత్తున అభిమానుల్లో చర్చ జరిగింది. ప్రస్తుతం ఓటీటీల్లో ఈ సినిమా స్టీమింగ్ అవుతున్నాయి. ఆ సినిమాల జాబితా ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పోకిరి
Image Credit : Facebook

పోకిరి

పోకిరి సినిమాలో మహేష్ బాబు అండర్ కవర్ పోలీస్ అధికారి అనే ట్విస్ట్ ప్రకంపనలు సృష్టించింది. ఈ సినిమా తర్వాత పోకిరి లాంటి ట్విస్ట్ అనే సామెత కూడా సినిమారంగంలో పుట్టింది అంటే అది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. డైరెక్టర్ పూరి జగన్నాధ్ మహేష్ బాబుని పోలీస్ అధికారిగా చూపించిన విధానం గూస్ బంప్స్ తెప్పిస్తుంది.

ఎక్కడ చూడాలి : జియో హాట్ స్టార్/ యూట్యూబ్

36
రంగస్థలం
Image Credit : our own

రంగస్థలం

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ మూవీలో చిట్టి బాబు అన్న కుమార్ బాబుని చంపింది ఎవరు అనే రివీల్ అయ్యే క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమా మొత్తానికి హైలైట్ అనే చెప్పాలి. ఆ సన్నివేశంలో రాంచరణ్, ప్రకాష్ రాజ్ నటన అద్భుతం. ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించిన విధానం మరో హైలైట్ అనే చెప్పాలి.

ఎక్కడ చూడాలి : ప్రైమ్ వీడియో

46
కల్కి 2898 ఎడి
Image Credit : our own

కల్కి 2898 ఎడి

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కల్కి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. క్లైమాక్స్ వరకు దాచిపెట్టి క్లైమాక్స్ లో ప్రభాస్ కరుడిగా రివీల్ చేసిన విధానం అద్భుతంగా ఉంటుంది. అభిమానులు ఎవ్వరూ ఇంత భారీ ట్విస్ట్ ని ఊహించలేదు. థియేటర్స్ లో అభిమానులకు క్లైమాక్స్ సీన్స్ తో గూస్ బంప్స్ వచ్చాయి.

ఎక్కడ చూడాలి : ప్రైమ్ వీడియో

56
ఎవరు
Image Credit : our own

ఎవరు

అడివి శేష్, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఇన్వెస్టిగేషన్ డ్రామాగా ఆకట్టుకుంది. క్లైమాక్స్ లో అడివి శేష్.. రెజీనాకి ఇచ్చే షాక్, ఆమె నిజస్వరూపాన్ని బయట పెట్టే సీన్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుంది.

ఎక్కడ చూడాలి : ప్రైమ్ వీడియో

66
బాహుబలి ది బిగినింగ్
Image Credit : Facbook / Baahubali

బాహుబలి ది బిగినింగ్

బాహుబలి 2 కోసం అభిమానులు ఎంతలా ఎదురు చూశారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలి 2 కి అంత క్రేజ్ రావడానికి ప్రధాన కారణం బాహుబలి 1 క్లైమాక్స్ లో కట్టప్ప ట్విస్ట్ అనే చెప్పాలి. అప్పట్లో వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనే చర్చ సోషల్ మీడియాలో విపరీతంగా జరిగింది.

ఎక్కడ చూడాలి : జియో హాట్ స్టార్

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India Top 10 Heroines: పడిపోయిన నయనతార, కాజల్‌, త్రిష, దూసుకొచ్చిన సాయిపల్లవి.. సమంత, రష్మిక స్థానాలివే
Recommended image2
Chiranjeevi: నాగార్జున సినిమా హోరులో డిజాస్టర్ అయిన చిరంజీవి మూవీ..డైరెక్టర్ తో గొడవ అందుకేనా ?
Recommended image3
Katrina Kaif Trolling: కత్రినా ట్రోల్ అవుతుంటే సల్మాన్ ఫైర్ అయ్యాడు.. మరి భర్త విక్కీ కౌశల్ ఎందుకు సైలెంట్?
Related Stories
Recommended image1
Hate Campaign: నన్ను తొక్కేయాలని చూశారు.. సంచలన నిజాలు బయటపెట్టిన ఓజీ హీరోయిన్
Recommended image2
Mahesh Namrata: సినిమాలు మానేసే ముందు మహేష్ కి నమ్రత పెట్టిన కండిషన్ ఇదే.. భయంతోనే రిక్వస్ట్ చేసిందట
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved