Asianet News TeluguAsianet News Telugu

కోట్లు విలువచేసే స్థలాన్ని సడెన్ గా అమ్మేసిన మెగాస్టార్ చిరంజీవి..? ఎందుకంటే..?

ఒకప్పుడు చాలా తక్కువ ధరకు కొన్న ఓ లాండ్ ను.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా అమ్మేశారట. ప్రస్తుతం ఈ టాపిక్ ఫిల్మ నగర సర్కిల్ లో చక్కెర్లు కొడుతుంది. ఇంతకీ ఆ లాండ్ ఆయన ఎందుకు  అమ్మారు..? 
 

Chiranjeevi Sold his land in Film Nagar Hyderabad
Author
First Published Sep 2, 2022, 2:14 PM IST

ఏజ్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతుననాడు మెగాస్టార్ చిరంజీవి. సెకండ్ ఇన్నింగ్స్ లో జోరు పెంచిన మెగాస్టార్.. ఇప్పటికే నాలుగైదు సినిమాలు లైన్ అప్ చేసుకున్నారు. రీసెంట్ గా ఆచార్య ప్లాప్ తో డిస్సపాయింట్ అయిన మెగాస్టార్.. ఇక నెక్ట్స్ సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఇటు తన సినిమాలు చూసుకుంటూ.. మరో వైపు  ఇండస్ట్రీ బాగోగులు కూడా చూసుకుంటూ.. టాలీవుడ్ కు పెద్దన్నలా వ్యవహరిస్తున్నారు చిరంజీవి. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం మెగాస్టార్  చిరంజీవి గురించి ఓ వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో తెగ వైరల్ అవుతోంది. చిరంజీవి కోట్లు విలువ చేసే తన స్థలాన్ని రీసెంట్ గా అమ్మేశారట. హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ సమీపంలో  మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు ఓక స్థలాన్ని కొన్నారు. అప్పట్లో ఆ  స్థలాన్ని ఆయన 30 నుంచి 40 లక్షల వరకు రేటు కు కొనుగోలు చేశారట. కాలం మారుతున్నా కొద్ది భూముల రేటు కూడా మారడంతో.. ఇప్పడు ఆస్థలం విలువ దాదాపు 70 కోట్లకు చేరింది. దాంతో  మెగాస్టార్ ఆ స్థలాన్ని ఏకంగా 70 కోట్లకు అమ్మేశారని టాక్. 

అయితే చిరంజీవి ఆ స్థలాన్ని ఇంత సడెన్ గా ఎందుకు అమ్మారో అంటూ.. గుసగుసలు మొదలు అయ్యాయి. కాని ఈ విషయంలో ఎటువంటి ప్రాధాన్యతా లేదని.. ఆ స్థలానికి మంచి రేటు రావడంతో  వెంటనే దాన్ని చిరు అమ్మేశారు తప్ప మరే కారణం లేదని సమాచారం. ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం నాలుగు సినిమాలు లైన్ అప్ చేశారు. అందులో మోహాన్ రాజా డైరెక్షన్ లో గాడ్ ఫాదర్ మూవీ దాదాపు షూటింగ్ అయిపోయి.. రిలీజ్ కు ముస్తాబు అవుతోంది. 

ఇది కాకుండా..  మెహర్ రమేష్ దర్శకత్వంలో  భోళాశంకర్ సినిమా చేస్తున్న చిరు.. యంగ్ డైరెక్టర్  బాబీతో కలిసి  వాల్తేరు వీరయ్య సినిమా చేస్తున్నాడు. ఇవి కాకుండా వెంకీ కుడుములతో కూడా ఒక సినిమాను అనౌన్స్ చేశాడు చిరంజీవి. ఈ సినిమాలతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించబోతున్నాడు మెగాస్టార్. 

Follow Us:
Download App:
  • android
  • ios