వేలు చూపించి మరీ హెచ్చరించిన చిరంజీవి.. ఎవరినో తెలుసా..?

Chiranjeevi shows his anger on reporter while talking about savithri movie
Highlights

వేలు చూపించి మరీ హెచ్చరించిన చిరంజీవి

 దివంగ‌త న‌టి సావిత్రి జీవితాన్ని మ‌హాన‌టి చిత్రం ద్వారా తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ప్ర‌స్తుతం ఇటు టాలీవుడ్‌, అటు కోలీవుడ్‌తోపాటు ప‌లు సినీ ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల నుంచి ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు. ఇదిలా ఉండ‌గా శ‌నివారం మ‌హాన‌టి చిత్ర యూనిట్‌ను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అభినందించారు.ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో చిరంజీవి మాట్లాడుతూ.. ప్ర‌ముఖ నిర్మాత అశ్వ‌నీద‌త్ కుమార్తెలు స్వ‌ప్నా ద‌త్‌, ప్రియాంక ద‌త్‌లు క‌లిసి మ‌హాన‌టి చిత్రాన్ని తెర‌కెక్కించ‌డం త‌న‌కు ఎంతో సంతోషం క‌లిగించింద‌న్నారు. అశ్వ‌నీద‌త్ త‌న‌తో ఎప్పుడూ ఒక మాట చెబుతుంటాడ‌ని.. క‌మర్షియ‌ల్ సినిమాలే కాకుండా.. ప్ర‌తీ ఒక్క‌రి మ‌న్న‌న‌లు పొందే సినిమాను తెర‌కెక్కించాలి, ఆ సినిమాకు అవార్డులు రావాలి అని అశ్వ‌నీద‌త్ చెప్పిన మాట‌ల‌ను చిరంజీవి గుర్తు చేశారు.

ఇదిలా ఉండగా.. చిరంజీవి మాట్లాడుతున్న స‌మ‌యంలో ఓ ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక విలేక‌రి ప్ర‌శ్న‌లు అడిగేందుకు ప్ర‌య‌త్నించ‌గా విసుగు చెందిన చిరంజీవి.. ఏయ్ డిస్ట‌ర్బ్ చేస్తున్నావంటూ వేలు చూపించి మ‌రీ హెచ్చ‌రించాడు. దీంతో ఒక్క‌సారిగా ఆ విలేక‌రితోపాటు.. ఆ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌వారంతా ఖంగుతిన్నారు. ఏదేమైనా.. ఒక‌రు మాట్లాడే స‌మ‌యంలో విసుగు చెందేలా ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించ‌డ‌మేంట‌ని నెటిజ‌న్లు ఆ విలేక‌రిపై కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

loader