'బాహుబలి'ని మించిన సినిమా అవుతుందా?

chiranjeevi's sye raa narasimha reddy to break the record of bahubali
Highlights

టాలీవుడ్ లో 'బాహుబలి' సినిమా వచ్చిన తరువాత భారీ బడ్జెట్ సినిమాల సంఖ్య మరింత పెరిగింది

టాలీవుడ్ లో 'బాహుబలి' సినిమా వచ్చిన తరువాత భారీ బడ్జెట్ సినిమాల సంఖ్య మరింత పెరిగింది. ఈ సినిమాలో చూపించిన యుద్ధ సన్నివేశాలు, గ్రాఫిక్స్ వర్క్ ను తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేరు. అంతగా తన మేకింగ్ తో ఆకట్టుకున్నాడు రాజమౌళి. ఇప్పుడు ఈ సినిమాను మించేలా యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించాలని నిర్ణయించుకుంది 'సైరా' చిత్రబృందం.

దీనికి తగ్గట్లుగా ప్లాన్ ను డిజైన్ చేసుకున్నారట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఓ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు. దానికోసం హాలీవుడ్ కు చెందిన నిపుణుల సహాయం తీసుకున్నారు. యాక్షన్ సీన్ కు విజువల్ ఎఫెక్ట్స్ జోడించి తీసిన ఈ వార్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఇక హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఓ సెట్ వేసి వార్ సీన్స్ ను షూట్ చేయబోతున్నారు.

ఈ వారంలోనే దీనికి సంబంధించిన పనులు జరగబోతున్నాయి. సినిమా బడ్జెట్ లో సగం ఈ యుద్ధ సన్నివేశాల కోసమే కేటాయించినట్లు సమాచారం. మరి బహుబలికి పోటీగా చేయాలనుకుంటున్న చిత్రబృందం ఈ విషయంలో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో నయనతార, తమన్నా,  అమితాబ్ బచ్చన్ వంటి తారలు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

loader