కొణిజేటి రోశయ్య మృతి రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఓ మహోన్నత నేత మరణం రాజకీయ, చిత్ర ప్రముఖులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
సీనియర్ రాజకీయవేత్త ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (Konijeti Rosaiah)హఠాన్మరణం అందరినీ కలచివేసింది. రాజకీయ కురువృద్ధుడిగా దశాబ్దాల పాటు ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేసిన రోశయ్య సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అనేక కీలక పదవులు అలంకరించారు. ఆర్థికమంత్రిగా అత్యధిక పర్యాయాలు బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రికార్డు ఆయన సొంతం. పక్కనే ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు గవర్నర్ గా రోశయ్య బాధ్యతలు నెరవేర్చారు. 88 ఏళ్ల రోశయ్య చాలా కాలంగా వృధ్యాప్య సంబంధింత రుగ్మతలతో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో నేడు ఉదయం కన్నుమూశారు.
కొణిజేటి రోశయ్య మృతి రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఓ మహోన్నత నేత మరణం రాజకీయ, చిత్ర ప్రముఖులను దిగ్భ్రాంతికి గురిచేసింది. రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్ గవర్నమెంట్ లో పనిచేసిన హీరో చిరంజీవి (Chiranjeevi) రోశయ్య మరణంపై స్పందించారు. ఆయన మరణం రాజకీయాలలో ఒక శకానికి ముగింపుగా వర్ణించారు.
'' మాజీ గవర్నర్,మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి తీరని విషాదం. రాజకీయాలలో ఆయన భీష్మాచార్యులు వంటివారు. ప్రజా జీవితంలో రోశయ్య ఒక మహోన్నత నేత రాజకీయ విలువలు, అత్యున్నత సంప్రదాయాలు కాపాడడం లో ఓ రుషి మాదిరిగా సేవ చేశారు రోశయ్య కన్నుమూయడంతో రాజకీయాలలో ఓ శకం ముగిసింది రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి నన్ను రాజకీయాల్లోకి రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానించారువివాదరహితులుగా, నిష్కళింకితులుగా ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి రోశయ్య, ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను....' అని చిరంజీవి ట్వీట్ చేశారు.
Also read Konijeti Rosaiah Death : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతాపం..
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన చిరంజీవి కాంగ్రెస్ గవర్నమెంట్ తో కలిసి పని చేశారు. రాజకీయాలలోకి చిరంజీవి ప్రవేశించక ముందే రోశయ్యతో చిరంజీవికి అనుబంధం ఉంది.
Also read ఆర్థిక మంత్రిగా సరికొత్త ఒరవడిని తీసుకొచ్చిన కొణిజేటి రోశయ్య.. రాజకీయ ప్రస్థానం..
