Asianet News TeluguAsianet News Telugu

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కోసం బాహుబలితో చిరు కసరత్తు

  • బాహుబలి2 చిత్రాన్ని చూసి రాజమౌళి అండ్ టీమ్ కు అభినందనలు తెలిపిన చిరంజీవి
  • చిరు తదుపరి చిత్రం ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి కథ చారిత్రక నేపథ్యం
  • యుద్ధాలు, ఎమోషన్స్ భారీగా ఉండటంతో ముమ్మర కసరత్తు
  • బాహుబలిని మరోసారి బిగ్ స్క్రీన్ లో చూసిన మెగాస్టార్
chiranjeevi more exercise for uyyalawada narasimha reddy watcching bahubali again

దర్శక దీరుడు రాజమౌలి తెరకెక్కించిన బాహుబలి చిత్రం చూసి ప్రపంచమంతా మెస్మరైజ్ అవుతోంది. ఈ చిత్రాన్ని చూసిన మెగాస్టార్ చిరంజీవి రాజమౌళికి, చిత్ర బృందానికి అభినందనలు కూడా తెలిపారు. అయితే మరోసారి బాహుబలి చిరంజీవి మరోసారి చరణ్‌తో కలిసి ఐమ్యాక్స్‌లో ఆ సినిమా చూసి వచ్చారు. ఆల్రెడీ చూసిన చిత్రానికి ఇంత బిజీ షెడ్యూల్ లో రెండోసారి థియేటర్‌కి వెళ్లి చూడడాన్ని బట్టి చిరంజీవికి ఈ చిత్రం ఏ స్థాయిలో నచ్చిందో తెలుసుకోవచ్చు.

 

తన తదుపరి చిత్రం చారిత్రిక నేపథ్యంలో, యుద్ధాలు, విఎఫ్‌ఎక్స్‌ ప్రధానంగా నడుస్తుంది కనుక అందులో ఎలాంటి అంశాలుండాలి, గ్రాఫిక్స్‌ ఏ స్థాయిలో వుండాలి లాంటివి చిరంజీవి క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారట. క్వాలిటీ పరంగా 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' బాహుబలికి తీసిపోకుండా వుండేందుకు చిరు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అందుకోసమే బాహుబలి ప్రేక్షకులకు ఈ స్థాయిలో నచ్చటానికి గల కారణాలను పరిశీలిస్తున్నారట చిరు.


ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కోసం ముందుగా అనుకున్న బడ్జెట్‌ని పెంచారని, బాహుబలితో ప్రేక్షకులకి దక్కిన విజువల్‌ ఎక్స్‌పీరియన్స్‌ రిపీట్‌ చేయగలిగితే ఉయ్యాలవాడ సక్సెస్‌ ఖాయమని చిరు భావిస్తున్నారు. బాహుబలి 2 రిలీజ్‌కి ముందు ఉయ్యాలవాడ చేయాలా, వద్దా అంటూ ఊగిసలాడిన మెగాస్టార్‌ ఈ చిత్రం సక్సెస్ చూసాక ఖచ్చితంగా అదే పర్ ఫెక్ట్ అని డిసైడ్ అయారు.

Follow Us:
Download App:
  • android
  • ios