ఈ నేపథ్యంలో ఏపీ వరద బాధిత జనం కోసం తెలుగు చిత్ర పరిశ్రమ కదులుతోంది. ఏ ఆపద వచ్చినా తామున్నామంటూ, మేముసైతమంటూ స్పందించే టాలీవుడ్‌ ఇప్పుడు ఏపీ కోసం ముందుకు వస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చాలా జిల్లాలు అతలాకుతలమయ్యాయి. చిత్తూరు, కడప, నెల్లూరు వంటి జిల్లాలు పూర్తిగా నీటమునిగాయి. వరదల కారణంగా భారీగా ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లింది. జన జీవనం అస్థవ్యస్తంగా మారింది. వరద బాధితులను రక్షించేందుకు, వారిని ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఈ నేపథ్యంలో ఏపీ వరద బాధిత జనం కోసం తెలుగు చిత్ర పరిశ్రమ కదులుతోంది. ఏ ఆపద వచ్చినా తామున్నామంటూ, మేముసైతమంటూ స్పందించే టాలీవుడ్‌ ఇప్పుడు ఏపీ కోసం ముందుకు వస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్‌ రూ. 25లక్షలు ప్రకటించారు. అల్లు అరవింద్‌ గీతా ఆర్ట్స్ పది లక్షలు విరాళంగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌కి అందజేశారు. 

ఇప్పుడు మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌ స్టార్‌ మహేష్‌, రామచరణ్‌ స్పందించారు. తమవంతుగా ఆర్థికసాయాన్ని ప్రకటించారు. చిరంజీవి రూ.25లక్షలు, మహేష్‌ రూ. 25లక్షలు, రామ్‌చరణ్‌ రూ.25 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వారు ఈ విరాళాన్ని వెల్లడించారు. మెగా స్టార్‌ ఫ్యామిలీ నుంచి మొత్తంగా రూ. 50 లక్షలు విరాళం ప్రకటించారు. సీఎం సహాయ నిధికి ఈ మొత్తాన్ని అందించబోతున్నట్టు వెల్లడించారు. 

Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…

ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి, రామ్‌చరణ్‌ కలిసి `ఆచార్య` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానుంది. మరోవైపు రామ్‌చరణ్‌ ప్రతిష్టాత్మక పాన్‌ ఇండియా మూవీ `ఆర్‌ఆర్‌ఆర్‌` లో నటిస్తున్నారు. ఎన్టీఆర్‌తో కలిసి చెర్రీ ఇందులో నటిస్తుండగా, రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. దీంతోపాటు శంకర్‌ డైరెక్షన్‌లో `ఆర్‌సీ15`లో నటిస్తూ బిజీగా ఉన్నాడు చరణ్‌. 

ఇక చిరంజీవి `ఆచార్య`తోపాటు మరో మూడు సినిమాలు చేస్తున్నారు. మోహన్‌రాజా దర్శకత్వంలో `గాడ్‌ఫాదర్‌` సినిమా చేస్తుండగా, ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తుంది. మరోవైపు మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో `భోళాశంకర్‌` సినిమా చేస్తున్నారు. ఇందులో తమన్నా కథానాయికగా, కీర్తిసురేష్‌.. చిరుకి చెల్లిగా నటిస్తుంది. మరోవైపు బాబీ డైరెక్షన్‌ మరో మెగాస్టార్ 154 సినిమా చేస్తున్నారు చిరు. ఇది త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. 

దీంతోపాటు మహేష్‌బాబు ప్రస్తుతం `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు. పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. బ్యాంకింగ్‌ రంగంలోని అవినీతి బయటపెట్టే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతున్నట్టు తెలుస్తుంది. ఇందులో కీర్తిసురేష్‌ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. 

also read: ఏపీ వరదలుః బాధితులకు అండగా నిలిచిన ఎన్టీఆర్‌.. అర్థిక సాయం..