Asianet News TeluguAsianet News Telugu

ఏపీ వరదలుః బాధితులకు అండగా నిలిచిన ఎన్టీఆర్‌.. అర్థిక సాయం..

ఏపీలో భారీ వర్షాలు పడుతుండటంతో మరింతగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. జనం అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ముందుకొచ్చారు. తనవంతు సాయాన్ని ప్రకటించారు. 

ntr donate 25 lakhs towards the relief of andhra pradesh flood disaster victims
Author
Hyderabad, First Published Dec 1, 2021, 5:41 PM IST

గత వారం కురిసిన భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్‌(AP Floods)లో పలు జిల్లాలు వరదల్లో మునిగిపోయిన విషయం తెలిసిందే. వేలాది మంది జనాలు వరదలతో ఇబ్బంది పడ్డారు. పలువురు మృత్యువాత పడ్డారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. జనజీవన అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటికీ జనం కోలుకోలేకపోతున్నారు. మళ్లీ అల్పపీడనం వల్ల వర్షాలు పడుతుండటంతో మరింతగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. జనం అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌(NTR) ముందుకొచ్చారు. తనవంతు సాయాన్ని ప్రకటించారు. 

చిరు సాయంగా తనవంతుగా రూ.25 లక్షలు ప్రకటిస్తున్నట్టు వెల్లడించారు Jr Ntr. ఈ మేరకు ఎన్టీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా ఈ విరాళాన్ని ప్రకటించారు. `ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల సంభవించిన వరదల వల్ల ప్రభావితమైన ప్రజల కష్టాలను చూసి చలించి, వారు కోలుకోవడానికి ఒక చిన్న చర్యగా నేను రూ.25లక్షలు అందిస్తున్నా` అని తెలిపారు ఎన్టీఆర్‌. ఇదిలా ఉంటే ఇటీవల ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కూడా తనవంతు సాయాన్ని ప్రకటించింది. రూ. 10లక్షలు ఏపీ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కి అందిస్తున్నట్టు వెల్లడించారు. అల్లు అరవింద్‌ సారథ్యంలో గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ నడుస్తున్న విషయం తెలిసిందే. 

ఇక ఎన్టీఆర్‌ ప్రస్తుతం `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR Movie) చిత్రంలో నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్‌ చిత్రమిది. పాన్‌ ఇండియా లెవల్‌లో, ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. ఎన్టీఆర్‌తోపాటు రామ్‌చరణ్‌ ఇందులో మరో హీరోగా నటిస్తున్నారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొనడానికి ముందు ఇటు కొమురం భీమ్‌, అటు అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం ప్రధానంగా సాగే చిత్రమిది. ఇందులో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. దాదాపు పది భాషల్లో సినిమాని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. 

ఇందులో ఎన్టీఆర్‌ సరసన బ్రిటీష్‌ నటి ఒలీవియా మోర్రిస్‌, చరణ్‌ సరసన బాలీవుడ్‌ నటి అలియాభట్‌ నటిస్తున్నారు. అజయ్‌ దేవగన్‌, శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే మేకింగ్‌ వీడియో, టీజర్‌ విడుదలయ్యాయి. మరోవైపు రెండు పాటలు రిలీజ్‌ అయి సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ నెల(డిసెంబర్‌) 3న `ఆర్‌ఆర్‌ఆర్‌` ట్రైలర్ విడుదల చేయాలని భావించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ట్రైలర్‌ రిలీజ్‌ని వాయిదా వేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఇదిలా ఉంటే సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. 

also read: RRR ట్రైలర్ వాయిదా.. అధికారికంగా ప్రకటించిన జక్కన్న టీం
 

Follow Us:
Download App:
  • android
  • ios