మా టీవీ మీలో ఎవరు కోటీశ్వరుడు షోని హోస్ట్ చేస్తున్న మెగాస్టార్ తనదైన శైలిలో షోని ఆకర్షణీయంగా హోస్ట్ చేస్తున్న చిరు చిరు మనసు పెద్దదని నిరూపిస్తూ గెలవని పార్టిసిపెంట్స్ కు ఆర్థిక చేయూత

మీలో ఎవరు కోటీశ్వరుడు' షోకి చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరిస్తారనగానే చాలా మందిలో సందేహాలు వ్యక్తమయ్యాయి. హోస్ట్‌ అంటే ఇలాగే వుండాలి అన్నట్టుగా నాగార్జున మొదటి మూడు సీజన్లలో ప్రశంసలు అందుకున్నాడు. నాగ్ షోని హోస్ట్ చేయటంలో సక్సెస్ అయిన విధంగా చిరంజీవి చేయలేడని విమర్శలు వచ్చాయి. 


అయితే ఖైదీ నంబర్‌ 150 సక్సెస్ ఇచ్చిన ఉత్సాహానికి తోడు, తన హాస్య చతురతని, జనంతో ఇంటరాక్ట్ కాగలిగే స్కిల్స్‌తో చిరంజీవిపై అనుమానాలు వ్యక్తం చేసిన వాళ్ల నోళ్లు మూయించారు. మెగాస్టార్ తనదైన శైలిలో మా మీలో ఎవరు కోటీశ్వరుడు షోను రన్ చేస్తున్నారు.

ఇంత కాలం కేవలం డిగ్నిఫైడ్‌ థ్రిల్లింగ్‌ గేమ్‌గా వున్న షోని చిరంజీవి ఎంటర్‌టైనింగ్‌గా మలుస్తున్నారు. షోలో ఎంటర్ టైన్ మెంట్ పండిస్తూనే పోటీలో పాల్గొంటున్న వారి కష్టాలకి స్పందించి, అనుకున్న మొత్తం గెలుచుకోలేక పోయిన వారికి తన సొంత అకౌంట్‌లోంచి డబ్బులిస్తూ చిరంజీవి అందరి మనసులు గెలుస్తున్నారు. కష్టాలకి స్పందించే గుణంతో పాటు మధ్య తరగతి కష్టాలేమిటి అనేది తెలిసిన వ్యక్తి కావడంతో చిరంజీవి ఈ షోకి పూర్తిగా కొత్త యాంగిల్‌ ఇస్తున్నారు. 

ఇక తనదైన శైలిలో తన తన హిట్ సినిమాల మెమొరీస్ ని పంచుకుంటూ, కోస్టార్స్ తో షోని అట్రాక్టివ్ గా మార్చి షోని మరితం అట్రాక్టివ్ గా మార్చారు బాస్. చిరంజీవి ఈ షో హోస్ట్‌గా సూపర్‌హిట్‌. నాగార్జున లా అయినా చేయగలడా అని డౌటుపడ్డ వారందరికి... మెగా స్టార్ స్టామినా చూపించాడు. అనుకన్నదానికంటే ఎన్నో రెట్లు షోని హోస్ట్ చేస్తూ.. చిరు మెస్మరైజ్ చేస్తున్నాడు.