రాజశేఖర్ కూతురు విషయంలో మెగాస్టార్ అలా చేశాడా..

First Published 24, Nov 2017, 11:59 PM IST
chiranjeevi help to rajasekhar family
Highlights
  • గత కొంత కాలంగా మెగాస్టార్ తో విబేధాలు పక్కనబెట్టామన్న జీవిత రాజశేఖర్
  • తమ కూతురు శివాని మెడికల్ సీటు విషయంలో చిరంజీవి సాయం తీసుకున్నామన్న రాజశేఖర్
  • గరుడవేగ సినిమాతో కొత్తగా ఏమీ కలవలేదని, ముందునుంచే సఖ్యత ఏర్పడిందన్న యాంగ్రీ మ్యాన్

 

‘గరుడవేగ’ సక్సెస్స్ కావడంతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన రాజశేఖర్ తో మీడియా సంస్థలు ఇప్పటికీ ఇంటర్వ్యూలు చేస్తూనే ఉన్నాయి. కొన్ని సంవత్సరాల పాటు రాజశేఖర్ చిరంజీవిలు యెడమొఖం పెడముఖంగా ఉండటమేకాకుండా గతంలో అనేక సార్లు రాజశేఖర్ చిరంజీవిని టార్గెట్ చేస్తూ ఘాటైన కామెంట్స్ కూడ చేసిన విషయం తెలిసిందే. దీనితో వీరిద్దరిమధ్య ఏర్పడ్డ అభిప్రాయభేదాలు కొన్ని ఏళ్ళపాటు అలాగే కొనసాగాయి.

 

ఇటీవల ‘గరుడవేగ’ సినిమా విడుదల నేపథ్యంలో రాజశేఖర్ తన భార్య జీవితతో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయన్ని సినిమా చూసేందుకు ఆహ్వానించడంతో ఇరువురి మధ్య సమస్యలు తొలిగిపోయాయి అని చాలమంది అభిప్రాయ పడ్డారు. అయితే తామిద్దరం కొత్తగా కలుసుకున్నదేమీ లేదని అంతకుముందే తమ మధ్య విభేదాలు తొలగిపోయాయని రాజశేఖర్ చెప్పాడు.

 

గతంలో తన కూతురి మెడికల్ సీటు కోసం తాను చిరు ఇంటికి వెళ్లిన విషయాన్ని ఈమధ్య ఒక లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలియ చేసాడు. ‘చిరు గారితో నాకు విభేదాలు వచ్చాక కొన్నేళ్లు దూరంగా ఉండిపోయాను. కానీ ఆ తర్వాత అప్పుడప్పడూ కలుస్తూనే ఉన్నాం. ‘మేముసైతం’ తో పాటు వేరే ఫంక్షన్లలో కలిశాం.

 

మా అమ్మాయి శివాని మెడికల్ సీటు కోసం అపోలో మెడికల్ కాలేజీలో అప్లై చేశాం. ఆ విషయంలో సపోర్ట్ కోసం జీవిత, చిరంజీవి గారి ఇంటికి వెళ్లింది. జీవిత వెళ్లగానే చిరంజీవి గారు నాగురించి అడిగారట. దీనితో జీవిత వెంటనే నాకు కాల్ చేసి రమ్మని చెప్పింది. కానీ నేను రెడీ అయి లేను. దీంతో ఆమె వెనక్కి వచ్చి నన్ను తీసుకెళ్లింది. చిరంజీవి గారు అప్పుడు బాగా మాట్లాడారు. మాకు అవసరమైన సాయం చేశారు. ఆ తర్వాత మేమిద్దరం బాగా కలిసిపోయాం. ‘గరుడవేగ’ విషయంలో ఆయన చాలా సపోర్ట్ చేశారు’ అని అంటున్నాడు రాజశేఖర్. 

 

ప్రస్తుతం వీరిద్దరూ ఒకటి అయిపోయారు కాబట్టి మెగా హీరోలు నటించే సినిమాలలో రాజశేఖర్ కు కీలక పాత్రలు ఏమైనా వస్తాయో రావో చూడాలి. ఇప్పటికే రాజశేఖర్ విలన్ పాత్రలకు కూడ తాను రెడీ అని సంకేతాలు ఇస్తున్నా ఇంకా టాప్ దర్శకులు ఎవ్వరు రాజశేఖర్ పట్ల అంతగా ఆసక్తి కనపరచకపోవడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

loader