'మహానటి' టీమ్ కు మెగా సన్మానం!

'మహానటి' టీమ్ కు మెగా సన్మానం!

సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కిన 'మహానటి' చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం' పడుతున్నారు. ఈ మధ్యకాలంలో విడుదలైన స్టార్ హీరోల చిత్రాలత్ పోటీపడుతూ తన ప్రత్యేకతను చాటుతోంది. ఈ సినిమాలో సావిత్రి జీవితంలో ఎదుర్కొన్న మంచి, చెడు రెండూ చూపించాడు దర్శకుడు. ఈ సినిమాను చూసిన కొందరు రాజకీయ ప్రముఖులు సైతం సోషల్ మీడియా వేదికగా మహానటికి టీమ్ కు అభినందనలు తెలిపారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ఈ చిత్రబృందాన్ని ఇంటికి పిలిపించుకొని మరీ సన్మానించడం విశేషం. మహానటి సినిమా ఎంతో అద్భుతంగా ఉందని, సావిత్రి లాంటి ఒక గొప్ప నటి కథను తెరపై తీసుకురావాలనే ఆలోచన ఎంతో గొప్పదని, ఆ ఆలోచనను సాకారం చేసిన దర్శకుడు నాగ్ అశ్విన్ కు, అతడికి సహకరించిన నిర్మాతలు స్వప్నా దత్, ప్రియాంక దత్ లకు నా ప్రత్యేక అభినందనలని చిరు తెలిపారు.

తెలుగుతో పాటు శుక్రవారం నాడు తమిళంలో విడుదలైన మహానటికి అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. లాంగ్ రన్ లో ఈ సినిమా నిర్మాతలకు భారీ లాభాలను మిగల్చడం ఖాయం. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos