దశాబ్ద కాలం తర్వాత కూడా తగ్గని మెగాస్టార్ క్రేజ్ రికార్డులు బ్రేక్ చేస్తున్న చిరు అమ్మడు కుమ్ముడు సాంగ్ ఆడియో సాంగ్ వ్యూస్ కే ఈ రేంజ్ లో ఉంటే మున్ముందు రఫ్పాడించేస్తాడంటున్న ఫ్యాన్స్
మెగాస్టార్ చిరంజీవి దాదాపు 9 ఏళ్ల తరువాత రీ ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా ‘ఖైదీ నెం 150’. ఈ సినిమాతో చిరు ఇండస్ట్రీలోని పాత రికార్డుల్ని కొల్లగొట్టి కొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తాడని మెగా అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ అంచనాలను మించిపోతూ ఖైదీ చిత్రం రిలీజుకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా రెండు రోజుల క్రితం విడుదలైన ఈ సినిమాలోని ‘అమ్మడు లెట్స్ డు కుమ్ముడు’ పాటఇప్పటి వరకూ 3 మిలియన్ల వ్యూస్ తో.. తక్కువ టైమ్ లో ఎక్కువ వ్యూస్ పొందిన పాటగా రికార్డ్ క్రియేట్ చేసి టాప్ 5 లో 3వ స్థానంలో నిలిచింది.
మరోవైపు కొద్ది రోజుల క్రితమే విడుదలైన టీజర్ కూడా ఇప్పటికీ జోరు తగ్గకుండా యూట్యూబ్ లో దూసుకుపోతోంది. చిరంజీవి స్టైలిష్ లుక్, పంచ్ డైలాగ్, ఫైట్ సీన్ అన్నీ కలిపి ఉన్న టీజర్ అభిమానులకు కనుల పండుగ చేసింది. ఇప్పటిదాకా ఈ వీడియోను 6 మిలియన్ల మంది వీక్షించారు. ఈ ప్రీ రిలీజ్ రికార్డులతో చిరు తన స్టామినా, స్టార్ డమ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. ఈ రికార్డులతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఊపందుకుంది. 2017 జనవరి 12న రిలీజ్ కానున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక పాటలో కనిపించనున్నాడు.

